News October 27, 2025
HYD: డబ్బు డబుల్ చేస్తామని మోసం.. నిందితుల అరెస్ట్..!

“బారిష్ పూజ” పేరిట డబ్బు రెట్టింపు చేస్తామని నమ్మించి ప్రజలను మోసం చేసిన నలుగురిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో బహదూర్‌పురకు వాసి, సోఫా వర్కర్ మొహమ్మద్ ఇర్ఫాన్, ఫిల్మ్‌నగర్‌కి చెందిన మేకప్ ఆర్టిస్ట్ గుగులోత్ రవీందర్, సూరారం కాలనీలోని కవిర సాయిబాబా, ఖైరతాబాద్‌కు చెందిన వాషర్‌మన్ ఠాకూర్ మనోహర్ సింగ్ ఉన్నారు.పోలీసులు రూ.8.50లక్షల నగదు, దేశీయ తుపాకి, కత్తి స్వాధీనం చేసుకున్నారు.
Similar News
News October 27, 2025
శ్రీకాకుళం: ‘విద్యుత్ సరఫరా అంతరాయానికి ఈ నంబర్లను సంప్రదించండి’

మొంథా తుఫాను కారణంగా జిల్లాలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని విద్యుత్ శాఖ ఎస్ఈ నాగిరెడ్డి క్రిష్ణమూర్తి తెలిపారు. సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తుఫాను పరిస్థితులను పర్యవేక్షించేందుకు శ్రీకాకుళం, టెక్కలి డివిజన్‌లో 9490610045, 9490610050 హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసిమనిన్నారు. విద్యుత్ లైన్లు తెగిపడినా.. స్తంభాలు పడిపోయిన తదితర సమస్యలు ఎదురైతే ఈ నంబర్లను సంప్రదించాలని కోరారు.
News October 27, 2025
AP: ‘మొంథా’ తుఫాన్ అలర్ట్స్

* ఉత్తర-వాయవ్య దిశగా గంటకు 15km వేగంతో కదులుతున్న తుఫాను
* రేపు సాయంత్రం లేదా రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం
* 44 మున్సిపాలిటీలు, 233 మండలాల్లోని 1,419 గ్రామాలపై ప్రభావం
* 2,194 పునరావాస కేంద్రాలు సిద్ధం చేసిన ప్రభుత్వం
* కమ్యూనికేషన్ కోసం జిల్లాలకు 16 శాటిలైట్ ఫోన్లు, 35 డీఎంఆర్ సెట్లు పంపిణీ
* వీఎంసీ కంట్రోల్ రూమ్: 0866-2424172, 0866-2422515, 0866-2427485 ఏర్పాటు
News October 27, 2025
విశాఖ: యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు సిద్ధం

మొంథా తుఫాను ప్రభావంతో విద్యుత్ సరఫరాలో ఏర్పడే అంతరాయాలను వేగంగా పునరుద్ధరించేందుకు ఏపీ ఈపీడీసీఎల్ సిద్ధంగా ఉందని సీఎండీ పృథ్వితేజ్ తెలిపారు. విద్యుత్ పునరుద్ధరణ కోసం 15 వేల విద్యుత్ స్తంభాలు, 950 ట్రాన్స్‌ఫార్మర్లు, 115 క్రేన్లు, 144 వైర్ లెస్ హ్యాండ్ సెట్లు, 80 JCBలు, 254 పోల్ డ్రిల్లింగ్ యంత్రాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఉద్యోగుల సెలవులు రద్దు చేసినట్లు చెప్పారు.


