News August 19, 2025
HYD: డాక్టరేట్ పట్టా పొందిన ఎమ్మెల్సీ దయాకర్

ఉస్మానియా విశ్వవిద్యాలయం 84వ స్నాతకోత్సవం ఈరోజు ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఓయూ ఛాన్స్‌లర్, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఇస్రో ఛైర్మన్ డాక్టర్ నారాయణ్, వీసీ కుమార్ మొగులం చేతుల మీదుగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ డాక్టరేట్ పట్టా పొందారు. ఆయన మాట్లాడుతూ.. గౌరవ డాక్టరేట్ అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.
Similar News
News August 20, 2025
బీజేపీ సర్కార్‌పై సంజయ్ రౌత్ సెటైర్

కేంద్ర ప్రభుత్వంపై శివసేన లీడర్, ఎంపీ సంజయ్ రౌత్ Xలో సెటైర్ వేశారు. ఢిల్లీలోని బీజేపీ హెడ్ క్వార్టర్స్‌లో ఈడీ, సీబీఐ, ఐటీ డిపార్ట్‌మెంట్, ఎలక్షన్ కమిషన్ పనిచేస్తున్నట్లుగా ఓ ఫొటోను పోస్ట్ చేశారు. దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని ఓట్ల చోరీకి పాల్పడుతుందని ప్రతిపక్షాలు గత కొంతకాలంగా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.
News August 20, 2025
ఎంపీడీవోలు సచివాలయాలను తనిఖీ చేయాలి: కలెక్టర్

జిల్లాలోని ప్రతి ఎంపీడీవో వారానికి 4 సచివాలయాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లాలోని ఎంపీడీవోలతో కలెక్టర్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మండలాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించాల్సిన ప్రధాన బాధ్యత ఎంపీడీవోలదే అన్నారు. జిల్లాలో క్లాప్ మిత్రా జీతాల సమస్య పరిష్కరించాలన్నారు.
News August 20, 2025
ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలు నిర్వహించాలి: కలెక్టర్

గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా జిల్లాలో గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కోరారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. ఉత్సవాల నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని కోరారు.