News October 8, 2024

HYD: డిగ్రీ, పీజీ విద్యార్థులకు GOOD NEWS

image

అన్ని రంగాల్లో కీలకంగా మారుతున్న ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI) టెక్నాలజీపై ప్రభుత్వం డిగ్రీ, పీజీ విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపింది. కృత్రిమ మేధలో ఉచిత శిక్షణ అందించేందుకు HYDలో ‘నెక్ట్స్ వేవ్’ స్టార్టప్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఒక్క ఏడాదిలో కనీసం లక్ష మందికి శిక్షణ అందించాలనే లక్ష్యం పెట్టుకుంది. వర్క్‌షాప్ ద్వారా 2-3 నెలల ట్రైనింగ్ అందిస్తారు. మొదట HYD కాలేజీల్లో దీన్ని అమలు చేస్తారు.

Similar News

News October 8, 2024

HYD: LRS దరఖాస్తుకు కావలసిన పత్రాలు

image

HYD, RR, MDCL జిల్లాలలో LRS దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. LRS దరఖాస్తు కోసం తప్పనిసరిగా ధ్రువీకరణ పత్రాలు ఉండాలని అధికారులు తెలిపారు. LRS ప్రతి దరఖాస్తుకు లింక్ డాక్యుమెంట్, లే అవుట్ కాపీ, సైట్‌ప్లాన్, స్థల మార్కెట్ విలువ ధ్రువీకరణ పత్రం, ఈసీ, సేల్ డీడ్ దస్త్రాలను జత చేయాలని పేర్కొంది. సిటిజన్ లాగిన్‌లో చరవాణి ద్వారా ఈ దస్త్రాలను జత చేసే వీలు కల్పించింది.

News October 8, 2024

HYD: LRS కోసం దరఖాస్తు చేసుకోండి

image

HYD, RR, MDCL జిల్లాలో అనుమతి లేని ఇంటి స్థలాలతో పాటు, అనధికార లేఅవుట్లలోని ఇంటి స్థలాల క్రమబద్ధీకరణకు 2020 నవంబరులో అప్పటి ప్రభుత్వం LRS పేరిట దరఖాస్తులు స్వీకరించింది. మధ్యలో దరఖాస్తు ప్రక్రియ ఆగిపోయినప్పటికీ మళ్లీ ప్రస్తుతం ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. https://lrs.telangana.gov.in లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని X వేదికగా టౌన్ ప్లానింగ్ అధికారులు సూచించారు.

News October 8, 2024

దసరా: హైదరాబాద్‌ను విడిచి ఊరెళ్లిపోతున్నారు!

image

దసరా పండుగతో నగరం ఖాళీ అవుతోంది. HYD ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సుల కోసం ప్రయాణికులు క్యూ కట్టారు. సద్దుల బతుకమ్మ, దసరా పండుగకు పట్టణం నుంచి పల్లెబాట పడుతున్నారు. ఈ నేపథ్యంలో MGBS, JBS, ఉప్పల్‌లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నప్పటికీ ప్రయాణికుల సంఖ్యకు సరిపోవడం లేదు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో కిక్కిరిసి ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది.