News October 7, 2024
HYD: డిప్యూటీ సీఎం భట్టిని కలిసిన మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి

HYD బేగంపేట్‌లోని ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తె, మల్లారెడ్డి మనుమరాలు శ్రేయారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను భట్టి విక్రమార్కకు అందజేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తదితరులున్నారు.
Similar News
News February 18, 2026
మాదకద్రవ్యాలతో రీల్స్ చేశారు.. అడ్డంగా బుక్ అయ్యారు!

సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం యువత దారి తప్పుతోంది. ఫలక్‌నుమాకు చెందిన శ్రీచరణ్, విజయ్ కృష్ణ అనే ఇద్దరు యువకులు శివరాత్రి పర్వదినం రోజున మాదకద్రవ్యాలను ప్రదర్శిస్తూ రీల్స్ చేసి నెట్టింట పోస్ట్ చేశారు. గమనించిన పోలీసులు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్, రీల్స్ మత్తులో పడి బంగారు భవిష్యత్తును కటకటాల పాలు చేసుకోవద్దని యువతను హెచ్చరించారు.
News February 18, 2026
ఉప్పుగూడలో గంజాయి చాక్లెట్ల పట్టివేత!

ఉప్పుగూడలో గంజాయి చాక్లెట్లను తండైలో కలిపి విక్రయిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ ఎస్టీఎఫ్ అధికారులు పట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్ ఆగ్రాకు చెందిన వికాస్ శర్మ (23) ఇటీవలే ఉప్పుగూడకు మకాం మార్చాడు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్టీఎఫ్ అధికారులు అతని ఇంటిపై దాడిచేసి తనిఖీలు నిర్వహించారు. సుమారు 9.6కిలో గ్రాముల బరువు చేసే 1,920 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేశారు.
News February 18, 2026
రంగారెడ్డి: పోలీసుల అదుపులో 23 మంది విదేశీయులు

టోలిచౌకి పరిధిలోని పలు కాలనీల్లో డీసీపీ చంద్రమోహన్ పర్యవేక్షణలో 250 మంది పోలీసులు భారీ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వీసా గడువు ముగిసినా అక్రమంగా నివసిస్తున్న 23 మంది విదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలతో పాటు 53 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.


