News May 9, 2024
HYD: డిప్లొమా చేసిన వారికి ఉద్యోగాలు..
డిప్లొమా చేసినవారికి రెండు సంవత్సరాల కాంట్రాక్టు ప్రాతిపదికన HYD బాలానగర్ CITD ఆధ్వర్యంలో ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు నోటీస్ విడుదలైంది. డిప్లొమా ఇన్ టూల్ అండ్ డై మేకింగ్, డిప్లొమా ఇన్ ప్రొడక్షన్ ఇంజినీరింగ్ చేసిన వారు అర్హులని తెలిపారు. CNC మిల్లింగ్ ఆపరేటర్, టర్నింగ్ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి. ఆసక్తి గలవారు https://forms.gle/zeFFXwpBZkuojgaWA ద్వారా ప్లేస్‌మెంట్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News January 26, 2025
ఓయూలో బీఈడీ పరీక్షా ఫీజు స్వీకరణ
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఈడీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫీజును మార్చి 4వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని చెప్పారు. రూ.200 అపరాధ రుసుముతో 6వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. ఈ పరీక్షలను మార్చి, ఏప్రిల్ నెలల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.
News January 25, 2025
HYDలో ఫేక్ ఫాస్ట్ ట్రాక్ వాచ్‌లు అమ్ముతున్న ముఠా అరెస్ట్
HYDలో ఫేక్ ఫాస్ట్ ట్రాక్ వాచ్‌లు అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బిహార్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు యువకులు ఫాస్ట్ ట్రాక్ వాచ్‌లు అని చెప్పి ఫేక్ వాచ్‌లను అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. చార్మినార్ పరిసరాల్లో ఈ ముఠా అమ్మకాలు జరపగా పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.కోటి విలువ చేసే 6,037 వాచ్‌లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
News January 25, 2025
ఓయూలో వివిధ డిగ్రీ కోర్సుల పరీక్షా ఫలితాల విడుదల
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ డిగ్రీ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీబీఏ, బీకామ్, బీఎస్సీ, బీఎస్సీ ఆనర్స్ తదితర కోర్సుల మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫలితాలను విడుదల చేశామని చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.