News January 10, 2026

HYD: డిఫెన్స్ భూములతో భారీ కారిడార్!

image

మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో ఎదురవుతున్న భూసేకరణ అడ్డంకులను తొలగించేందుకు ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. బాపుఘాట్ పరిసరాల్లో ఉన్న సుమారు 200 ఎకరాల డిఫెన్స్ భూమిని సేకరించేందుకు కేంద్రంతో సంప్రదింపులు తుది దశకు చేరుకున్నాయి. ఈ భూమి లభిస్తే, నది వెడల్పును పెంచడంతో పాటు అక్కడ భారీ స్థాయిలో ‘నైట్ ఎకానమీ’ హబ్‌, అంతర్జాతీయ స్థాయి వాక్-వేలను నిర్మించవచ్చని అధికారులు Way2Newsకు తెలిపారు.

Similar News

News February 17, 2026

విశాఖ చేరుకున్న సీఎం చంద్రబాబు

image

అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు మంగళవారం సాయంత్రం విశాఖ చేరుకున్నారు. విశాఖ ఎయిర్ పోర్ట్‌లో ఆయనకు MP శ్రీ భరత్, జాయింట్ కలెక్టర్ విద్యాదరి తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. ఆయన ఎయిర్ పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన నగరంలోకి వెళ్లారు.

News February 17, 2026

గద్వాల్: ఈ నెల 23 నుంచి సర్పంచ్‌లకు శిక్షణ

image

కొత్తగా ఎన్నికైన సర్పంచులకు ఈనెల 23 నుంచి 27 వరకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎర్రవల్లిలోని 10వ పోలీస్ బెటాలియన్‌లో జరగనున్న ఈ శిబిరంలో నూతన పంచాయతీ రాజ్ చట్టం-2018పై సమగ్ర అవగాహన కల్పించనున్నారు. అయిజ, ఇటిక్యాల, రాజోలి, మానవపాడు, అలంపూర్, ఎర్రవల్లి మండలాల సర్పంచులు ఈ శిక్షణకు తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ ఆదేశించారు.

News February 17, 2026

నిజామాబాద్ జిల్లాలో భైంసా వాసి మృతి

image

భైంసా మండలం దేగాం గ్రామానికి చెందిన పాట్రోల్ల మాణిక్యం (38) నిజామాబాద్ జిల్లాలో ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. పశువులను మేపేందుకు ముగ్పాల్ మండలం చిన్నాపూర్ శివారుకు వెళ్లిన మాణిక్యం.. అక్కడ హన్మాన్ చెరువులో దిగగా లోతు తెలియక మునిగిపోయాడు. సమాచారం అందుకున్న ముగ్పాల్ పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి కేసు నమోదు చేశారు. భైంసా వాసి పక్క జిల్లాలో మృతి చెందడంతో దేగాం గ్రామంలో విషాదం నెలకొంది.