News October 27, 2025

HYD: డీప్‌ఫేక్ కేసులో విచారిస్తున్నాం: సీపీ

image

మెగాస్టార్ చిరంజీవి ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలు సృష్టించడంతో సైబర్ క్రైమ్ పోలీసులకు మెగాస్టార్ చిరంజీవి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ స్పందిస్తూ.. చిరంజీవి డీప్‌ఫేక్ కేసులో విచారణ చేస్తున్నామని, సెలబ్రిటీల ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసే కేటుగాళ్లపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసి విచారణ చేస్తామన్నారు.

Similar News

News October 27, 2025

HYD: కొమురం భీమ్‌కు బీజేపీ ఘన నివాళులు

image

గిరిజన వీరుడు కొమురం భీమ్ వర్ధంతి సందర్భంగా ఈరోజు HYD నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కొమురం భీమ్ త్యాగం, ధైర్యం తరతరాలకు ప్రేరణగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అమర్ సింగ్ తిలావత్, Ex MP.ప్రొ.సీతారాం నాయక్, ST మోర్చా అధ్యక్షుడు నేనావత్ రవి నాయక్, పార్టీ నేతలు పాల్గొన్నారు.

News October 27, 2025

HYDలో యాక్సిడెంట్ BLACK SPOTS..!

image

HYDలో రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న బ్లాక్ స్పాట్స్‌ను నేషనల్ యాక్సిడెంట్ సర్వే (NAS) గుర్తించింది. బోయిన్‌పల్లి, తాడ్‌బండ్, డైరీ ఫార్మ్, బహదూర్‌పుర, ఎంజీ మార్కెట్, అఫ్జల్‌గంజ్, చాదర్‌ఘాట్, మూసారాంబాగ్ తదితర ప్రాంతాల జంక్షన్లు అత్యధికంగా ప్రమాదాలు జరిగే ప్రదేశాలుగా నివేదికలో పేర్కొంది. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ, రోడ్డు నిర్మాణ లోపాలు ఉన్నాయంది.

News October 27, 2025

HYD: మనిషి లేకుండా రోబోలతోనే వ్యవసాయం: వీసీ

image

మానవ రహిత వ్యవసాయమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని HYD రాజేంద్రనగర్‌లోని ప్రొ.జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ VC జానయ్య తెలిపారు. ఆకుకూరల కోత, సంరక్షణ కోసం రూపొందించిన రోబోలు ఈ దిశగా కీలకపాత్ర పోషిస్తున్నాయన్నారు.అగ్రి హబ్ ఇన్నోవేషన్ సెంటర్ ద్వారా ఈ సాంకేతికతను మరింత అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.రోబోటిక్ టెక్నాలజీతో వ్యవసాయంలో సమయాన్ని, శ్రమను ఆదా చేయడంతోపాటు దిగుబడి పెంపు సాధ్యమవుతుందన్నారు.