News February 11, 2025

HYD: డ్రగ్స్ పట్టేందుకు 120 జాగిలాలకు శిక్షణ

image

నగరంలో డ్రగ్స్ మూలాలపై ANB యాంటీ నార్కోటిక్ బ్యూరో ఫోకస్ పెట్టింది. బాంబు తరహాలో నార్కిటిక్స్ డాగ్ స్క్వార్డును అధికారులు సిద్ధం చేసినట్లుగా తెలిపారు. సుమారు 120 జాగిలాలను అత్యుత్తమ శిక్షణ ఇచ్చారు. ఈ జాగిలాలు డ్రగ్స్ మూలాలను సైతం పసిగట్టడానికి అవకాశం ఉంటుందని తెలియజేశారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు.

Similar News

News February 11, 2025

GNT: ఉమ్మడి జిల్లా నేతలతో జగన్ సమావేశం

image

తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి బుధవారం సమావేశం కానున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్‌ ఛైర్‌ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు సమాచారం.

News February 11, 2025

వికారాబాద్: 13న రైతులతో సంప్రదింపులు: కలెక్టర్ 

image

దుద్యాల మండలం లగచర్ల గ్రామ రైతులతో ఈనెల 13న సంప్రదింపుల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. వికారాబాద్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో సమావేశం హాల్‌లో ఈనెల 13న మధ్యాహ్నం 1:30 గంటలకు లగచర్ల గ్రామ శివారులోని సర్వే నంబర్ 102,117,120, 121, అసైండ్ భూమి సర్వే నంబర్ల రైతులతో భూమి ఎకరాకు పరిహారం నిర్ణయిస్తామన్నారు. 

News February 11, 2025

స్టాక్‌మార్కెట్ల క్రాష్: 4 నెలల్లో ₹85లక్షల కోట్ల నష్టం

image

స్టాక్‌మార్కెట్లు పతనమవుతుండటంతో ఇన్వెస్టర్ల సంపద కనీవినీ ఎరగని విధంగా ఆవిరవుతోంది. గత SEP 27న నిఫ్టీ 26,277 వద్ద జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. నాటి నుంచి నేటి వరకు దాదాపుగా 3500 పాయింట్లు పడిపోయింది. అంటే 13% పతనమైంది. ఫలితంగా ఇన్వెస్టర్లు నవంబర్లో రూ.31L CR, డిసెంబర్లో రూ.10L CR, జనవరిలో రూ.27L CR, ఫిబ్రవరిలో రూ.15L CR మొత్తంగా సుమారు రూ.85 లక్షల కోట్ల సంపద కోల్పోయారు.

error: Content is protected !!