News May 3, 2024

HYD: డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరి అరెస్టు

image

కాటేదాన్, బాబూల్ రెడ్డి నగర్లో ఓ గిడ్డంగిలో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందడంతో శంషాబాద్ ఎక్సైజ్, టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్ చేశారు. రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు నల్లమందు స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. తనిఖీలో రూ.కోటి 60లక్షల విలువ చేసే నల్ల మందును గుర్తించారు. ఇద్దరిని అరెస్టు చేసి ఎన్డిపిఎస్ చట్టం కింద కేసు నమోదు చేసిన్నట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News April 1, 2026

రంగారెడ్డి: రేపు గ్రామ, వార్డు సభలు.. ప్రభుత్వ సూచనలు

image

1) ఉ.10గంటలకు రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ ఆలపించి, సభను ప్రారంభించాలి.
2) గ్రామసభలో సర్పంచ్‌తోపాటు పాలకవర్గం, వార్డు సభలో మున్సిపల్ ఛైర్మన్‌తోపాటు పాలకవర్గం, అధికారులు, ప్రజలు హాజరుకావాలి.
3) CMసందేశాన్ని చదివి వినిపించాలి.
4) ప్రభుత్వ విజయాలు, 6గ్యారంటీలపై అవగాహన కల్పించి, పథకాలకు అర్హులను గుర్తించాలి.
5) ప్రజాసమస్యల కోసం ఫిర్యాదుల బాక్సులను ఏర్పాటు చేయాలి.. పరిష్కారాలపై కార్యాచరణ రూపొందించాలి.

HYD: రూ.2,501 కోట్ల ఆస్తి పన్ను వసూలు

image

క్యూర్ పరిధిలోని 3 కార్పొరేషన్లలో 2025- 26 ఆర్థిక సంవత్సరానికి రూ.2,501.25 కోట్ల ఆస్తి పన్ను వసూలైంది. భారీ బకాయిదారులకు వడ్డీపై 90 శాతం రాయితీ, ఓటీఎస్ సదుపాయాన్ని వివరించడం, ఇతరత్రా చర్యలతో ఇది సాధ్యమైందని అధికారులు తెలిపారు. ఆర్థిక సంవత్సరం చివరి రోజైన మంగళవారం ఒక్కరోజే వంద కోట్లకు పైగా ఆస్తి పన్ను జీహెచ్ఎంసీ ఖజానాకు చేరినట్లు సమాచారం. కాగా, సరైన లెక్కలు నేడు స్పష్టం కానున్నాయి.