News February 8, 2025
HYD: ఢిల్లీలో కాంగ్రెస్‌కు గాడిద గుడ్డు మిగిలింది: హరీశ్‌రావు

ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గాడిద గుడ్డు మిగిలిందని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. మొన్న హర్యానా, నిన్న మహారాష్ట్ర, నేడు ఢిల్లీ ఘోర పరాజయంలో రాహుల్, రేవంత్ రెడ్డిల పాత్ర అమోఘం అన్నారు. ఇక్కడ హామీలు అమలు చేయకుండా, ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేసుకున్నంత మాత్రాన ఓట్లు పడతాయా? అని ప్రశ్నించారు. మీ గ్యారెంటీల నిజస్వరూపం దేశవ్యాప్తంగా బట్టబయలైందని విమర్శించారు.
Similar News
News April 8, 2026
బేగంపేటలో ట్రైనీ పైలట్‌పై అత్యాచారం

బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పైలట్ శిక్షణ సంస్థలో దారుణం జరిగింది. పైలట్ శిక్షణ పొందుతున్న యువతిపై ఇన్‌స్ట్రక్టర్ నసీముద్దీన్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలిని లొంగదీసుకొని, అసభ్యకర ఫొటోలు, వీడియోలు తీసి బెదిరింపులకు దిగాడు. నిందితుడి వేధింపులు భరించలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా, దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
News April 8, 2026
స్టేట్ INCOME.. మన HYD నుంచే అధికం..!

రాష్ట్రానికి అధిక ఆదాయం ఉమ్మడి రంగారెడ్డి నుంచే సమకూరుతోంది. 2025-26లో దాదాపు 80% రాబడి(రూ.78,706CR)తో HYD, RR, MDCL, సంగారెడ్డి(D) టాప్‌లో నిలిచాయి. ఈ ప్రాంతాల్లో ఎక్కువ పరిశ్రమలు, కంపెనీలుండటం ఇందుకు ముఖ్యకారణం. ఇక నారాయణపేట, ములుగు, భూపాలపల్లి, ఆసిఫాబాద్(D)లు 1-2%తో వెనుకంజలో ఉన్నాయి. ఈ జిల్లాలు వ్యవసాయంపైనే ఆధారపడటం, తయారీ యూనిట్లు అంతంతమాత్రంగానే ఉండటంతో ఇన్‌కంలో చెప్పుకోదగ్గ స్థానాల్లో లేవు.
News April 8, 2026
HYD రోడ్లపై రోజుకు ఎన్ని బండ్లు తిరుగుతున్నాయో తెలుసా..?

సిటీలో రోడ్లపై రోజుకు సగటున ఎన్ని వాహనాలు వెళ్తున్నాయో తెలిపారు సైబరాబాద్ పోలీసులు. హైటెక్ సిటీలో గంటసేపు పరిశీలిస్తే కేబుల్ బ్రిడ్జ్‌పై రోజుకు 1,20,000 వెహికిల్స్ వెళ్తున్నట్లు గుర్తించారు. గంటకు 13,500 బండ్లు 4 సైడ్ల రోడ్లపై తిరుగుతున్నాయట. సింగిల్ ఆక్యుపెన్సీ వాహనాలు 6,554, డబుల్ ఆక్యుపెన్సీ 3,584గా ఉన్నాయని చెప్పారు. ఐదుగురు వెళ్లే కారులో ఒక్కరే వెళ్తుండటమూ ట్రాఫిక్‌కు కారణమమని పేర్కొన్నారు.


