News July 6, 2025
HYD: తక్కువ ఖర్చుతో పార్సిల్.. సెంటర్లు ఇవే..!

తక్కువ ఖర్చుతో ఇతర ప్రాంతాలకు RTC కార్గో సెంటర్ల ద్వారా పార్సిల్ చేయొచ్చని అధికారులు తెలిపారు. HYD రీజియన్ పరిధి నాగోల్ క్రాస్ రోడ్డు, ఓయూ క్యాంపస్, పనామా గోడౌన్, సంతోష్ నగర్, ఆరాంఘర్, గుడిమల్కాపూర్, బోలకపూర్, నాంపల్లి, టెలిఫోన్ భవన్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు బస్ భవన్, నారాయణగూడ, సంతోష్ నగర్, చింతలకుంట, పెద్దఅంబర్పేట, మునగనూరు క్రాస్ రోడ్ వద్ద ప్రత్యేక కౌంటర్లు ఉన్నాయి. బరువు ప్రకారం ఛార్జీ ఉంటుంది.
Similar News
News July 6, 2025
తాండూర్: లారీ ఢీకొని ఒకరి మృతి

తాండూరు మండలం బోయపల్లి బోర్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. స్థానిక డాబా నుంచి బిర్యానీ తీసుకుని తాండూర్ బోర్డు వైపుగా వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కాసిపేటకు చెందిన మల్లేశ్ గౌడ్(36)గా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
News July 6, 2025
ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడండి: ఎస్పీ

గుంటూరు నగరంలో శంకర్ విలాస్ ఆర్వోబీ పనులు జరుగుతున్న నేపథ్యంలో చేపట్టిన ట్రాఫిక్ మళ్లింపులను ఎస్పీ సతీశ్ కుమార్ ఆదివారం పరిశీలించారు. వాహనాల రాకపోకల రద్దీ ఎక్కువగా ఉండే రహదారులు, ప్రధాన కూడళ్లు, ట్రాఫిక్ మళ్లింపులు వద్ద తగినంత మంది ట్రాఫిక్ సిబ్బందిని కేటాయించి సమన్వయం చేసుకోవాలన్నారు. సమాచార వ్యవస్థతో ప్రణాళిక బద్దంగా ట్రాఫిక్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు.
News July 6, 2025
విజయానికి 5 వికెట్లు

ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో ఐదో రోజు భారత బౌలర్ ఆకాశ్‌దీప్ అదరగొడుతున్నారు. మ్యాచ్ ప్రారంభమైన 5 ఓవర్లకే రెండు కీలక వికెట్లు తీశారు. పోప్(24), బ్రూక్(23)ను ఔట్ చేశారు. దీంతో ఇంగ్లండ్ 83 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఆకాశ్ 4 వికెట్లు, సిరాజ్ ఒక వికెట్ తీశారు. ENG స్కోరు 83/5. ఇంకా 5 వికెట్లు తీస్తే భారత్‌దే విజయం.