News July 4, 2024

HYD: తలనొప్పి భరించలేక యువతి ఆత్మహత్య

image

ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. HYD బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానిక ఉదయ్ నగర్‌లో నివసించే పీ.అనురాధ(21) ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. నెల రోజుల నుంచి తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న ఆమె ఇటీవల ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లగా వైద్యుడు మాత్రలు ఇచ్చి సీటీ స్కాన్ తీసుకునిరావాలని సూచించాడు. అదే రోజు రాత్రి తన గదిలోకి వెళ్లిన యువతి ఉరేసుకుంది. గమనించిన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Similar News

News February 19, 2026

ప్రముఖ విద్యా సంస్థలకు దీటుగా BRAOU

image

ప్రఖ్యాతిగాంచిన విద్యా సంస్థలకు ధీటుగా అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం విద్యార్ధులు పోటీ పడుతున్నారని వీసీ ఘంటా చక్రపాణి హర్షం వ్యక్తంచేశారు. టీసీఎస్‌ అయాన్‌ భాగస్వామ్య కంపెనీల ద్వారా ఎంపికైన 64 మంది అభ్యర్థులకు గురువారం వర్సిటీ ప్రాంగణంలో ఆఫర్‌ లెటర్లు అందజేశారు. దేశంలోని ప్రముఖ విద్యా సంస్థలకు దీటుగా డా.బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం పోటీపడుతుందన్నారు.

News February 19, 2026

HYD: EAPCETకి 3,385 అప్లికేషన్స్

image

TG EAPCET ప్రవేశ పరీక్షకు సంబంధించి ఈ రోజు నుంచి ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. ఫార్మసీ, అగ్రికల్చర్ విభాగాలకు సంబంధించి 1,430 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఇంజినీరింగ్ విభాగానికి 1,950 మంది అప్లై చేయగా 2 విభాగాలకు 5 మంది దరఖాస్తు చేసుకోవడంతో 3,385 అప్లికేషన్ వచ్చాయని TG EAPCET కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి JNTUHలో వెల్లడించారు.

News February 19, 2026

HYD: ఇంటి స్థలంలో ప్రభుత్వానికి 5% తాకట్టు!

image

250 గజాలకు మించి ఉన్న స్థలంలో భవన నిర్మాణం చేపట్టాలంటే సెట్ బ్యాక్ ఉండాలి. అయితే చాలా మంది ఈ నిబంధనలను ఉల్లంఘిస్తుండటంతో 10% స్థలాన్ని స్థానిక సంస్థకు తాకట్టు పెట్టాలి. ఇది గతంలో నిబంధన.. అయితే రియల్ ఎస్టేట్ బిజినెస్ తగ్గిపోవడంతో ఈ రూల్ సవరించాలని సర్కారు నిర్ణయించినట్లు సమాచారం. 5% తాకట్టు పెట్టి.. భవన నిర్మాణం పూర్తైన తరువాత సెట్ బ్యాక్ ఉందని తేలితే ఆ భూమి రిలీజ్ చేస్తారు.