News July 2, 2024
HYD: తల్లిదండ్రులూ.. మీ పిల్లలు జర జాగ్రత్త..!

పిల్లలను ఎక్కువ సేపు సెల్ ఫోన్ వాడనీయొద్దని, దానికి అడిక్ట్ కాకుండా తల్లిదండ్రులు చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. సెల్‌ఫోన్ ఎక్కువుగా వాడుతున్నారని తల్లిదండ్రులు మందలించడంతో ఇంట్లో నుంచి పిల్లలు వెళ్లిపోయిన ఘటనలు తాజాగా HYDలో వెలుగు చూశాయి. సికింద్రాబాద్ వారాసిగూడలో ఈశ్వర్(14), తార్నాక లాలాపేట్‌లో సాయివాసవి(13), నల్లకుంటలో మరో బాలిక(14) ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి.
Similar News
News January 27, 2026
HYD: కలల ఇల్లు చూసుకొని వస్తుండగా.. అంతులేని విషాదం

అభం శుభం తెలియని చిన్నారిని కూకట్‌పల్లిలో విధి వెంటాడింది. ఇంటికెళ్ళాల్సిన 2 ‘U TURN’లు దాటించి 3వ U TURN వద్ద మృత్యు పాశం మాంజా రూపంలో ఆ కుటుంబంలో <<18967621>>తీరని శోకాన్ని<<>> మిగిల్చింది. పటాన్‌చెరులో కొత్త ఇల్లు చూసుకొని తిరిగి వివేకానందనగర్ వస్తుండగా నగల దుకాణంలోకి వెళ్దాం అనుకుని ఆగితే.. ముందు కూర్చున్న 5ఏళ్ల నిష్విక ఏంజరుగుతుందో తెలియకుండానే తల్లిదండ్రుల ముందే ప్రాణాలు విడిచింది.
News January 27, 2026
HYD: ‘వాడి టార్గెట్ GYM చేసే యువకులే’

జిం చేసే యువతకు అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు విక్రయిస్తున్న మొహమ్మద్ ఫైజల్ ఖాన్‌ను వెస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సూరత్ నుంచి వీటిని తెప్పించి ప్రిస్క్రిప్షన్ లేకుండా అత్తాపూర్ పరిసరాల్లో విక్రయిస్తున్నాడు. అతడి నుంచి భారీగా ఇంజెక్షన్లు, సిరంజీలను స్వాధీనం చేసుకున్నారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా స్టెరాయిడ్లు వాడితే కిడ్నీలు, లివర్ దెబ్బతింటాయని డాక్టర్లు చెబుతున్నారు.
News January 26, 2026
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ జోగినపల్లి సంతోష్ కుమార్‌కు సిట్ అధికారులు 160 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేశారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్‌లోని సిట్ కార్యాలయానికి హాజరుకావాలని కోరారు. సిట్ విచారణకు సహకరించాలన్నారు.


