News February 20, 2026
HYD: తల్లి మృతికి కారణమైనందుకే గర్భిణీ హత్య!

వనస్థలిపురం PS పరిధి కప్పలచెరువు సమీపంలో బుధవారం సునీతను హత్య చేసిన <<19181178>>నిందితుడు<<>> మహేష్(30)ను పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర వాసి సునీతను 2022లో వివాహం చేసుకోగా వివాదాలతో అతనిపై వేధింపుల కేసు పెట్టింది. 2024లో పరస్పర విడాకులు జరిగి ఆమె 2025లో రెండో వివాహం చేసుకుంది. కేసుల వేధింపులతో అతని తల్లి ఇటీవలే మరణించింది. దీంతో పగ పెంచుకుని చంపానని నిందితుడు మహేష్ ఒప్పుకున్నాడు.
Similar News
News February 21, 2026
రైతు బంధు నిధులు ఎక్కడ: హరీశ్ రావు

TG: రైతుబంధు పేరు చెప్పి ఓట్లు వేయించుకున్నారని, కానీ ఇంతవరకు నిధులు విడుదల చేయలేదని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. రైతుబంధు ఇవ్వకపోతే ప్రత్యక్ష పోరాటం చేస్తామన్నారు. సీఎం, వ్యవసాయశాఖ మంత్రి ఆఫీసులను ముట్టడిస్తామని చెప్పారు. అటు మెదక్ మున్సిపాలిటీలో BRS కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టారని మండిపడ్డారు. పోలీసులు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
News February 21, 2026
ఉమ్మడి మెదక్: ఏప్రిల్ 10 నుంచి SA-II పరీక్షలు

ఉమ్మడి మెదక్ జిల్లాలోని పాఠశాలల్లో 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 10 నుంచి 20 వరకు సమ్మేటివ్–2 పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉమ్మడి మెదక్ జిల్లా విద్యాధికారులు తెలిపారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసినట్లు వెల్లడించారు. విద్యార్థులు సమగ్రంగా సన్నద్ధం కావాలని, ఉపాధ్యాయులు మార్గనిర్దేశనం చేయాలని సూచించారు.
News February 21, 2026
వినుకొండ: ఆరోగ్య కేంద్రంలో సందర్శించిన సీఎం

స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు వినుకొండలో పర్యటించారు. పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను సందర్శించి రోగులతో మాట్లాడారు. ఆసుపత్రిలో కాన్పు అయిన నాగేశ్వరి, నేత్రావతి అనే బాలింతలను పరామర్శించారు. వారికి జన్మించిన శిశువులను ఆప్యాయంగా ఎత్తుకుని ఆశీర్వదించారు. తల్లీబిడ్డల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.


