News January 31, 2025
HYD: తల్లి మృతి.. 9 రోజులు ఇంట్లోనే మృతదేహం

వారాసిగూడలో విషాద ఘటన వెలుగుచూసింది. తల్లి మృతి చెందడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిన కూతుళ్లు 9 రోజులుగా ఇంట్లోనే ఉండిపోయారు. దుర్వాసన రావడంతో స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా ఈ విషయం వెలుగుచూసింది. MLA పద్మారావు చొరవతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని గాంధీకి తరలించారు. మృతురాలు శ్రీ లలిత (45) అని పేర్కొన్నారు. తల్లిని కోల్పోయిన రవళిక (25), అశ్విత (22) కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
Similar News
News November 6, 2025
జూబ్లీహిల్స్ బై పోల్స్: కేసీఆర్ ప్రచారంపై సస్పెన్స్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రచారం ఊపందుకుంది. ప్రధాన మూడు పార్టీల నుంచి ప్రముఖ నాయకులు చురుగ్గా ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మాత్రం ఇటువైపు చూడలేదు. కేసీఆర్ ప్రచారంపై కార్యకర్తలు, నాయకులకు ఇంకా క్లారిటీ లేదు. కేసీఆర్ ప్రచారం చేస్తారా?, లేదా అనేది ఇప్పటికి సస్పెన్స్ అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ప్రచారం మరో 3 రోజుల్లో ముగియనుంది.
News November 6, 2025
HYD: 10 మందికి ఊపిరినిచ్చిన ‘తండ్రి’

ఆ తండ్రి చనిపోయినా 10 మందిలో జీవిస్తున్నారు. మేడ్చల్ పరిధిలోని అత్వెల్లిలో గత వారం 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ నారెడ్డి భూపతి రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. తుదిశ్వాస విడిచినా.. 10మందికి ఆయన ఊపిరినిచ్చారు. అవయవాలు దానం చేసి 10 మందికి ప్రాణం పోసినట్లు ఆయన కుమారుడు నారెడ్డి నవాజ్ రెడ్డి తెలిపారు.
News November 6, 2025
HYD: మీర్జాగూడ యాక్సిడెంట్.. యువకుడి మెసేజ్ వైరల్!

ట్రాఫిక్ రూల్స్‌పై ప్రజల్లో చైతన్యం పెంచేందుకు ఓ యువకుడు చేసిన పని అందరినీ ఆలోచింపజేస్తోంది. ‘రూల్స్ ఎప్పుడూ ఇబ్బందిగా అనిపిస్తాయి. మన ప్రాణాలు కాపాడేవి అవే. త్వరగా వెళ్లాలంటే ముందు జాగ్రత్తగా వెళ్లాలి. మీ ఇంటికెళ్తూ వేరే ఇళ్లల్లో కన్నీళ్లు మిగిల్చకండి’ అంటూ మూసాపేట్ మెట్రో స్టేషన్ సమీపంలో ఓ యువకుడు ఇలా ప్లకార్డులు పట్టుకొని కనిపించాడు. మీర్జాగూడ ఘటన నేపథ్యంలో యువకుడు ఇచ్చిన మెసేజ్ వైరలవుతోంది.


