News April 10, 2024
HYD: తల్లి వదిలేసింది.. తండ్రి చనిపోయాడు.. బాలిక ఆత్మహత్య

హాస్టల్‌లో ఉండే ఓ బాలిక సూసైడ్ చేసుకున్న ఘటన HYDదుండిగల్ PSపరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. సూరారం ప్రాంతానికి చెందిన బాలిక(13) దుండిగల్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటోంది. మూడేళ్ల వయసులో ఆమెను తల్లి వదిలేసి వెళ్లింది. ఇటీవల తండ్రి మరణించడంతో ఒంటరైంది. బాలికను ఆమె మేనత్త ఓ ఫౌండేషన్‌లో చేర్పించింది. ఈక్రమంలో బాలిక హాస్టల్ రూమ్‌లో ఉరేసుకుని చనిపోగా మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News September 17, 2025
HYD: దక్కన్ రేడియోలో నిజాం ఏం చెప్పారంటే?

‘నా ప్రియమైన ప్రజలారా హమ్ నే భారత్‌కే సదర్ గవర్నర్ జనరల్ రాజగోపాల చారి గారికి పంపుతున్న సందేశం ఏమిటంటే.. నా రాజీనామా సమర్పించడంతోపాటు రజాకారులను నిషేధించమని కోరుతూ HYD సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంటూ ఇస్తున్న సందేశం. ఇకనుంచి ఇక్కడి ప్రజలు భారత ప్రజలతో కలిసి కులమతాలకు అతీతంగా సుఖ సంతోషాలతో భేద భావాలు లేకుండా సామరస్యంగా ఒకే తాటిపై జీవించాలని కోరుతున్నా’ అని ప్రసంగించారు.
News September 17, 2025
1948 SEP 17 తర్వాత HYDలో ఏం జరిగింది?

‘ఆపరేషన్ పోలో’ తర్వాత HYD సంస్థానాదీశుడు నిజాం భారత ప్రభుత్వానికి తలొగ్గారు. ‘గోల్కొండ ఖిల్లా కింద ఘోరి గడతాం’అని ఎవరిపై ప్రజలు తిరగబడ్డారో ఆయనను ప్రభుత్వం తెలంగాణకు రాజ్ ప్రముఖ్‌గా నియమించి గౌరవించింది. ఆ తర్వాత ఆయనకు ప్రత్యేక సెక్యూరిటీ కల్పించింది. రజాకార్లకు నాయకత్వం వహించిన ఖాసీం రజ్వీని పాకిస్థాన్‌కు పంపింది. 1952లో జనరల్ బాడీ ఎలక్షన్స్ వచ్చాయి. ప్రజలను పీడించిన ప్రభువుల కథ సుఖాంతం అయింది.
News September 17, 2025
HYDలో గోల్డ్ షాపు యజమానుల ఇళ్లలో ఐటీ సోదాలు

తెల్లవారుజామునుంచే HYDలోని ప్రముఖ గోల్డ్ షాపు యజమానుల ఇళ్లలో ఐటీ సోదాలు చేస్తోంది. ట్యాక్స్ చెల్లింపుల్లో అవకతవకల నేపథ్యంలో ఈ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 15 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. వరంగల్లోనూ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.