News August 15, 2025

HYD: తాగునీటి సరఫరా చేసే ముందు పరీక్షలు చేయాలి: MD

image

HYDలో తాగునీరు స‌ర‌ఫ‌రా చేసే ముందు క‌చ్చితంగా నాణ్య‌త‌ను ప‌రీక్షించాల‌ని అధికారుల‌ను జలమండలి MD అశోక్ రెడ్డి ఆదేశించారు. ఎక్క‌డా తాగునీరు క‌లుషితం కాకుండా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు. బ‌స్తీలు, లోతట్టు ప్రాంతాలపై మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాలన్నారు. క్లోరిన్ బిల్ల‌ల‌ను ఇంటింటికీ పంపిణీ చేసి, వాటిని వినియోగించి నీటిని శుద్ధి చేసుకునే తీరుపై అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని సూచించారు.

Similar News

News August 15, 2025

ఆ కష్టాలు మళ్లీ రాకుండా GHMC ముందు జాగ్రత్త..!

image

2020, 2023లో భారీ వర్షాల కారణంగా గ్రేటర్ HYD పరిధిలోని పలు చెరువులు నిండి కట్టలు తెగి బస్తీలు, కాలనీల్లోకి వెళ్లాయి. ఇప్పుడు ఆ సమస్య ఉత్పన్నం కాకుండా గ్రేటర్ అధికారులు చెరువుల ఎఫ్టీఎల్‌ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఎఫ్టీఎల్‌కు రెండు అడుగుల తక్కువగానే నీరుండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎఫ్టీఎల్‌కు దగ్గరగా నీటి మట్టం పెరిగితే నీటిని తోడేందుకు మోటార్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

News August 15, 2025

HYD: లోకల్ వ్యాపారుల పోరాటం.. బంద్‌కు పిలుపు

image

మార్వాడీ వ్యాపారస్థులకు వ్యతిరేకంగా లోకల్ వ్యాపారులు చేస్తోన్న పోరాటం ఉద్ధృతమవుతోంది. నార్త్ ఇండియా నుంచి TGకు వచ్చి తమకు ఉపాధి లేకుండా చేస్తున్నారని, తాము ఎలా బతకాలంటూ వారు వాపోతున్నారు. ‘మార్వాడీ వ్యాపారస్థులు గోబ్యాక్’ అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆమనగల్లులో లోకల్ వ్యాపారస్థులందరూ కలిసి ఈనెల 18న స్వచ్ఛంద బంద్‌కు పిలుపునిచ్చారు.కాగా ఇదంతా BRS,కాంగ్రెస్ కుట్ర అని బండి సంజయ్ HYDలో ఆరోపించారు.

News August 15, 2025

HYD: అద్భుత రూపంలో శ్రీదుర్గాదేవి అమ్మవారు

image

HYD ఎల్బీనగర్ పరిధి మన్సూరాబాద్ డివిజన్ శ్రీసాయినగర్ కాలనీలోని శ్రీ దుర్గాదేవి దేవాలయంలో అమ్మవారికి ఈరోజు ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణ మాసం నాలుగో శుక్రవారం వేళ అమ్మవారిని గాజులతో అలంకరించారు. నిమ్మకాయల దండ వేశారు. అమ్మవారు భక్తులకు అద్భుతంగా దర్శనమిచ్చారు. మహిళా భక్తులు తెల్లవారుజాము నుంచే వచ్చి దర్శించుకుంటున్నారని ఆలయ కమిటీ ఛైర్మన్ పోచబోయిన గణేశ్ యాదవ్ తెలిపారు.