News February 3, 2026
HYD: తాళి బొట్టు తీసింది.. సర్టిఫికెట్లతో వెళ్లిపోయింది..!

భార్యాభర్తల మధ్య తలెత్తిన గొడవతో ఓ గృహిణి అదృశ్యమైన ఘటన మేడిపల్లి PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. పర్వతాపూర్‌కు చెందిన మహేందర్‌కు రాణితో 15Yr క్రితం వివాహమైంది. JAN 31న ఆఫీసులో పార్టీ ఉందని రాత్రి ఇంటికి రానని భర్త చెప్పడంతో వాగ్వాదం జరిగింది. మరుసటి రోజు ఉదయం భార్య ఫోన్, మంగళసూత్రాన్ని ఇంట్లోనే వదిలి, రూ.8 వేల నగదు, సర్టిఫికెట్లతో వెళ్లిపోయింది. భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.
Similar News
News February 3, 2026
T20 వరల్డ్ కప్.. HYDలో బిగ్ స్క్రీన్‌లు

క్రికెట్ వరల్డ్ కప్.. ఈ పేరే ఓ కిక్.. ఈ నెల 7 నుంచి నెలరోజులపాటు క్రికెట్ ప్రియులను పొట్టి వరల్డ్ కప్ అలరించనుంది. నగరవ్యాప్తంగా ఉన్న పలు బార్లు, రెస్టారెంట్లు ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నాయి. బిగ్ స్క్రీన్లను ఏర్పాటు చేసి.. ప్రత్యేక ఆఫర్లు ప్రకటించి నిర్వాహకులు బిజినెస్ పెంచుకునే పనిలోపడ్డారు. చిల్ అవుతూ క్రికెట్ చూస్తుంటే ఆ మజానే వేరప్పా అని కొందరు క్రికెట్ ప్రేమికులు చెబుతున్నారు.
News February 3, 2026
BREAKING: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై బైకు దగ్ధం

దుర్గం చెరువు కేబుల్ వంతెనపై మంగళవారం ఒక్కసారిగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బైకుపై ఇద్దరు ప్రయాణిస్తుండగా ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గమనించిన వారు అప్రమత్తమై వెంటనే వాహనాన్ని నిలిపి పక్కకు దూకడంతో పెను ప్రమాదం తప్పింది. క్షణాల్లోనే బైకు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనతో వంతెనపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు మంటలను అదుపు చేశారు.
News February 3, 2026
గ్రేటర్ HYDలో మరోసారి తాగునీటి కష్టాలు!

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరోసారి తాగునీటి కష్టాలు రానున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈఏడాది వాటర్ కనెక్షన్లు పెరగడం, భూగర్భ జలాలు తగ్గడమే ప్రధాన కారణంగా కనిపిస్తుంది. దీనికి తోడు జలాశయాల నుంచి నీటి కేటాయింపులు ఏమాత్రం పెరగలేదు. సమ్మర్ డిమాండ్ మేరకు సరఫరా చేస్తారా లేదా అనేది అనుమానంగా మారింది. ఇప్పటికే ట్యాంకర్ల బుకింగ్లు జోరందుకున్నాయి. మండువేసవిలో పరిస్థితి ఎలా ఉంటుందనే భయం ఇప్పటికే మొదలైంది.


