News August 19, 2025

HYD- తిరుపతి విమానంలో సాంకేతిక లోపం

image

శంషాబాద్ ఎయిర్ పోర్టులో HYD- తిరుపతి అలియాన్స్ ఎయిర్‌లైన్స్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. 67 మంది ప్రయాణికులు బోర్డింగ్ అయిన తర్వాత సాంకేతిక లోపాన్నీ పైలెట్ గుర్తించారు. తిరిగి ప్రయాణికులను దింపేసి సాంకేతిక లోపాన్ని నిపుణులు పరిశీలిస్తున్నారు. కాగా.. తిరుపతి వెళ్లాల్సిన 67 మంది ప్రయాణికులు హోల్డింగ్‌లొనే ఉన్నారు.

Similar News

News August 19, 2025

గతంలో 3 నెలలు ఊచలు లెక్కించిన ‘సృష్టి’ నమ్రత

image

అక్రమ సరోగసి కేసులో అరెస్ట్ అయిన డా.నమ్రత గతంలో 3 నెలలు జైలులో ఉండి వచ్చారు. 2020లో ఏపీలోని మాడుగులకు చెందిన ఓ మహిళ నమ్రతపై ఫిర్యాదు చేయడంతో జైలుకు వెళ్లింది. తనకు మాయమాటలు చెప్పి తన బిడ్డను తీసుకున్నారని ఫిర్యాదు చేయడంతో ఏపీ పోలీసులు విశాఖ జైలుకు తరలించారు. జైలు నుంచి తిరిగి వచ్చినా నమ్రత దందా కొనసాగించి ఇటీవల మళ్లీ అరెస్ట్ అయింది.

News August 19, 2025

HYD: నిమజ్జనోత్సవానికి ఖర్చు రూ.30 కోట్లు

image

నిమజ్జనోత్సవం.. HYDలో ఈ వేడుక ఉంటే సందడేవేరు. ఇందుకు GHMC దాదాపు రూ.30 కోట్లు ఖర్చు చేయనుంది. అలాగే సెప్టెంబరు 6న జరిగే శోభాయాత్ర, నిమజ్జనాలకు బల్దియా అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రోడ్ల మరమ్మతులు, విద్యుత్ తీగలకు సమస్యలు రాకుండా చర్యలు, అడ్డుగా ఉన్న చెట్టు కొమ్మలను తొలగింపు పనులు చురుగ్గా సాగుతున్నాయి. వినాయకచ చవితి (27న) మూడో రోజు నుంచే (29న) HYDలో నిమజ్జనాలు ప్రారంభమవుతాయి.

News August 19, 2025

యూట్యూబ్‌లో ఇంకా ‘సృష్టి’ వీడియోలు!

image

సృష్టి ఫెర్టిలిటి సెంటర్ నిర్వాహకురాలిగా డా.నమ్రత యూ ట్యూబ్‌లో వీడియోలను అప్లోడ్ చేసింది. ఆ వీడియోలు ఇంకా అందులోనే ఉన్నాయి. సరోగసి పేరుతో నవజాత శిశువులను విక్రయించి రిమాండులో ఉన్న నమ్రత ప్రసంగాలు ఇంకా అందుబాటులో ఉండటంతో పలువురు మండిపడుతున్నారు. ఇంత మోసం చేసిన ఆమె వీడియోలు యూట్యూబ్‌లో తొలగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఆ దిశగా పోలీసులూ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరీ మీరేమంటారు.