News April 14, 2024

HYD: తిరుపతి వెళ్లేవారే TARGET.. జర జాగ్రత్త..!

image

తిరుపతి వెళ్లే వారి వద్ద డబ్బులు తీసుకుని మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదైన ఘటన ఎల్బీనగర్ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బైరామల్‌గూడ వాసి కపిల్ రెడ్డిని చరణ్ అనే వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. తాను TTD ఛైర్మన్ PA అని, శ్రీవారి దర్శనం టికెట్లు బుక్ చేస్తానని నమ్మించి ఈనెల 7న రూ.1,60,900 తీసుకున్నాడు. ఆ తర్వాత కపిల్.. చరణ్‌కు ఫోన్ చేయగా సమాధానం ఇవ్వలేదు. బాధితుడు PSలో ఫిర్యాదు చేశాడు.

Similar News

News January 7, 2025

HYD: బాలికపై అత్యాచారం.. నిందితుడికి 20ఏళ్ల జైలు

image

మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి 20ఏళ్ల జైలు శిక్ష, రూ.15వేల జరిమానా విధిస్తూ రంగారెడ్డి కోర్టు తీర్పు ఇచ్చింది. 2018లో వనస్థలిపురం PS పరిధిలో తాపీ మేస్త్రిగా పనిచేసే కార్తిక్(22) ఓ బాలికను ప్రేమ పేరుతో మభ్యపెట్టి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో నిందితుడిపై పోక్సో కేసు నమోదైంది. ఈ కేసుపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి ఈ మేరకు తీర్పు వెల్లడించారు.

News January 7, 2025

సంక్రాంతి తర్వాత రైతు భరోసా డబ్బులు: మంత్రి తుమ్మల

image

రైతు భరోసా డబ్బులను సంక్రాంతి పండగ తర్వాత రైతుల ఖాతాల్లో జమచేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం చేవెళ్ల మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ దుకాణాల సముదాయం గోదాములను స్పీకర్ ప్రసాద్ కుమార్, ఎమ్మెల్యే యాదయ్యతో కలిసి మంత్రి ప్రారంభించారు. రైతుల అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని చెప్పారు.

News January 7, 2025

HYD: భారీగా పట్టుబడ్డ నకిలీ పన్నీరు

image

హైదరాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిసరి ఎంక్లేవ్‌లో నకిలీ పన్నీరు భారీ మొత్తంలో పట్టుబడింది. విశ్వసనీయ సమాచారంతో నకిలీ పన్నీరు తయారు కేంద్రంపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేపట్టారు. నిందితులను పట్టుకొని అల్వాల్ పోలీసులకు అప్పగించారు. అక్కడ సుమారు 600 కిలోల పన్నీరు, కొన్ని రకాల కెమికల్స్ సీజ్ చేసినట్లు  పోలీసులు తెలిపారు. బేగం బజార్‌కు  చెందిన ఓ వ్యాపారి దీన్ని నిర్వహిస్తున్నట్టు సమాచారం.