News October 6, 2025
HYD: తూచ్.. ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్ రెడ్డిని బదిలీ చేయలేదు..!

తూచ్.. అసలు బదిలీ క్యాన్సల్ అన్నట్లు ఉంది వ్యవహారం. నిన్న జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్ రెడ్డిని బదిలీ చేస్తూ అనంతరం అక్కడ సైదులును నియమిస్తూ పోలీస్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. 24 గంటల తర్వాత నోటిఫికేషన్‌లో మార్పు చేస్తూ యధావిధిగా వెంకటేశ్వర రెడ్డిని కొనసాగించింది. ఎస్‌బీకి సైదులును ట్రాన్స్‌ఫర్ చేశారు.
Similar News
News October 6, 2025
HYD: జూబ్లీహిల్స్‌లో పోస్టర్లు, బ్యానర్లను తొలగిస్తాం: కర్ణన్

నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడించింది. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా వెంటనే పోస్టర్లు, బ్యానర్లను తొలగిస్తామని, నవంబర్ 14వ తేదీన నగరంలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి మైదానంలో ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. ఈసీ నిబంధనలను అందరూ పాటించాలని సూచించారు.
News October 6, 2025
HYD: కాసేపట్లో ఇంటికి.. ఇంతలోనే యాక్సిడెంట్

ఫోన్ పోయిందని మేడ్చల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి బైక్‌పై ఇంటికి వెళ్తుండగా దంపతులను వెనుక నుంచి కంటైనర్ లారీ వేగంగా ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. మేడ్చల్ ITI కళాశాల ముందు జాతీయ రహదారి-44పై జరిగిన ఈ ఘటనలో కళావతి(35) తలపై నుంచి లారీ దూసుకెళ్లిందన్నారు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందిందని, ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
News October 6, 2025
HYD: హైవేలపై ఏ మాత్రం తగ్గని ట్రాఫిక్ జామ్..!

HYD నుంచి వరంగల్, విజయవాడ, నాగపూర్ తదితర ప్రాంతాలకు వెళ్లే జాతీయ రహదారులపై ట్రాఫిక్ జామ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇటీవల పండుగ నేపథ్యంలో సిటీ నుంచి సొంతూరుకు వెళ్లిన వారు తిరిగి నగరానికి వస్తుండడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఉన్నతాధికారులు అనేక చోట్ల ట్రాఫిక్ పోలీసులు, సిబ్బందిని, SCSC బృందాలను రంగంలోకి దించినట్లు తెలిపారు.