News March 7, 2026

HYD: తెలుగువర్సిటీలో జ్యోతిష ఝరి

image

HYD తెలుగు విశ్వవిద్యాలయం NTR ఆడిటోరియంలో నిర్వహించిన రసఝరి కార్యక్రమంలో వీసీ ఆచార్య వెలుదండ నిత్యానందరావు జ్యోతిష శాస్త్ర ప్రాముఖ్యతను వివరించారు. ఖగోళ గ్రహాల గమనాలపై నిషిత అధ్యయనం, కచ్చితమైన కాలనిర్ణయంతో జ్యోతిషం శాస్త్రీయ ప్రమాణంతో ఉండాలని అన్నారు. ప్రభుత్వం ప్రతిపాదించిన శతదిన విద్య ప్రణాళికలో భాగంగా జరిగిన కార్యక్రమంలో జ్యోతిష శాఖ విద్యార్థులు ‘దారిదీపం’ నాటకాన్ని ప్రదర్శించారు.

Similar News

News April 8, 2026

NLG: ఏడేళ్లుగా అదే పారితోషికమా?

image

సర్కార్ తీరుపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గత ఏడాది పదో తరగతి పేపర్ల దిద్దుబాటు చేసినా, దానికి సంబంధించిన రెమ్యూనరేషన్ ఇప్పటికీ అందకపోవడంపై నల్గొండకు చెందిన ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న మొన్నటి వరకు కులగణన విధుల్లో పాల్గొన్న వారికీ పైసలు ఇవ్వలేదు. ఇంటర్ పేపర్ల వాల్యుయేషన్ రేట్లు పెంచిన సర్కారు, మరి టెన్త్ క్లాస్ వారికి ఎందుకు పెంచడం లేదని టీచర్లు ప్రశ్నిస్తున్నారు.

News April 8, 2026

NLG: దేశస్థాయిలో 5-స్టార్ రేటింగ్ కైవసం

image

విద్యాబోధనలోనే కాదు.. పర్యావరణ పరిరక్షణలోనూ NLG కేంద్రీయ విద్యాలయం దేశానికే ఆదర్శంగా నిలిచింది. ప్రకృతిని ప్రేమిస్తూ, వనరులను పొదుపుగా వాడుతున్న ఈ పాఠశాలకు 5-స్టార్ రేటింగ్ లభించినట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో NLG కేవీకి ఈ స్థానం దక్కడం విశేషమని, ఇది ఉపాధ్యాయులు, విద్యార్థుల సమష్టి కృషికి దక్కిన గౌరవమని ప్రిన్సిపల్ తెలిపారు.

News April 8, 2026

సిద్దిపేట జిల్లాలో 32 మంది సీనియర్ అసిస్టెంట్ల బదిలీ

image

సిద్దిపేట జిల్లాలో 32 మంది సీనియర్ అసిస్టెంట్లను బదిలీ చేస్తూ కలెక్టర్ కె.హైమావతి ఉత్తర్వులు జారీ చేశారు. గత కొన్నాళ్లుగా బదిలీలపై నిషేధం ఉండడంతో డిప్యూటేషన్ ప్రతిపాదికన బదిలీలు చేశారు. మూడేళ్లపాటు ఒకే స్థానంలో ఉన్న RI, సీనియర్ అసిస్టెంట్లను బదిలీ చేసి తక్షణమే కేటాయించిన స్థానాల్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.