News April 9, 2025

HYD: తెలుగు యూనివర్సిటీలో పుస్తక ప్రదర్శన

image

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో పుస్తక ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటి రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు తెలిపారు. నాంపల్లి తెలుగు విశ్వవిద్యాలయంలో ఈ నెల 17 వరకు ప్రాచీన గ్రంథాలు, సాహిత్యం, నిఘంటువులు, సంగీత, నృత్య గ్రంథాలు, భారత, భాగవతాలు, ప్రబంధాలు, పురాణాలు, పంచకావ్యాలు, ఇతిహాసాలు, చరిత్ర పంథాలు, పోటీ పరీక్షలకు అవసరమయ్యే పుస్తకాలను 60% రాయితీతో ఇవ్వనున్నట్లు తెలిపారు.

Similar News

News April 18, 2025

సూర్యాపేట: పొలం కోయిస్తుండగా కనిపించిన మృతదేహం 

image

వరి పొలంలో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపిన ఘటన మునగాలలో గురువారం చోటుచేసుకుంది. మునగాలకు చెందిన తూముల వీరస్వామి పొలంలో హార్వెస్టర్‌తో పొలం కోయిస్తుండగా మృతదేహం కనిపించడంతో భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే వీరస్వామి పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు.

News April 18, 2025

? ప్లేస్‌లో ఉండాల్సిన నంబర్ ఏంటి?

image

పై ఫొటోలో ఉన్న రీజనింగ్ క్వశ్చన్‌ చూశారు కదా! చిన్న లాజిక్ ఉపయోగిస్తే దీన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ? ప్లేస్‌లో ఉండాల్సిన నంబర్ ఏంటో కనుగొంటే COMMENT చేయండి.

News April 18, 2025

మెదక్ సీనియర్ సివిల్ జడ్జి జితేందర్ బదిలీ

image

మెదక్ సీనియర్ సివిల్ జడ్జి సిహెచ్. జితేందర్ బదిలీ అయ్యారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జడ్జిల బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జితేందర్ మెదక్ నుంచి సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్‌కు 27వ అదనపు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. మెదక్ సీనియర్ సివిల్ జడ్జిగా అర్చన రెడ్డి బదిలీపై రానున్నారు. ఇప్పటికే జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మి శారదా సూర్యాపేటకు బదిలీ అయిన విషయం తెలిసిందే.

error: Content is protected !!