News January 10, 2026

HYD: తెలుగు రాష్ట్రాల్లో ఏకైక అద్భుత ఆలయం

image

చారిత్రక నేపథ్యం ఉన్న ఘట్‌కేసర్ (M) ఏదులాబాద్‌లోని మన్నారు గోదాదేవి సమేత రంగనాథస్వామి దేవాలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. TG,APలో ఏకైక ఆలయంగా ప్రఖ్యాతిగాంచింది. ఈఆలయానికి 600 ఏళ్ల చరిత్ర ఉంది. అప్పలదేశికుడికి ఆండాళ్ దేవికలలో దర్శనమిచ్చి ఆలయ నిర్మాణానికి ఆదేశించింది. జమీందారుల విరాళాలతో గుడి నిర్మాణం సాధ్యమైంది. సంతానప్రదాయినిగా గాజులమ్మను కొలుస్తారు. నాగుల పంచమినాడు మట్టిగాజులు సమర్పిస్తారు.

Similar News

News February 14, 2026

సికింద్రాబాద్‌లో రేపు మెగా సెమీనార్

image

బాల్యం తర్వాత కొత్త జీవితంలోకి తొలి అడుగు వేసేది 10th క్లాస్ తర్వాతే. అలాంటి కీలకమైన దశలో స్టూడెంట్స్‌తో పాటు వారి తల్లిదండ్రులు ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునేలా Way2News & Resonance సంస్థ సంయుక్తంగా ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాయి. సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌లోని క్లాసిక్ గార్డెన్‌లో రేపు(ఆదివారం) ఉదయం 10:30 గంటలకు జరిగే ఈ సదస్సులో CBI EX జేడీ లక్ష్మీనారాయణ పాల్గొని మార్గనిర్దేశం చేస్తారు.

News February 14, 2026

HYD చుట్టూ 10 సీక్రెట్ నగరాలు!

image

రియల్ ఎస్టేట్ అంటే హైటెక్స్ మాత్రమే కాదు. RRR వెంట HMDA ప్లాన్ చేస్తున్న 10 గ్రీన్‌ఫీల్డ్ టౌన్‌షిప్‌లు గేమ్ ఛేంజర్ కాబోతున్నాయి. ప్రభుత్వం భూములు కొనకుండా ‘ల్యాండ్ పూలింగ్’ (LADP)తో రైతులనే పార్ట్‌నర్లను చేస్తోంది. సంగారెడ్డి IT హబ్‌గా, తూప్రాన్ లాజిస్టిక్స్ అడ్డాగా, ఆమన్‌గల్‌ ఫ్యూచర్ సిటీ గేట్‌వేగా మారనున్నాయి. ఈ 10 క్లస్టర్ల పరిధిలోకి వచ్చే గ్రామాల సర్వే నంబర్ల జాబితా ఇంకా సీక్రెట్‌గానే ఉంది.

News February 14, 2026

Big Plan: హైదరాబాద్ మహా అవతారం!

image

HYD మరింత పెద్దది కాబోతోంది. ప్రస్తుతం HMDA పరిధి 7,257 చదరపు కిలోమీటర్లు ఉండగా దీన్ని 10,472 చదరపు KMకు పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీని ద్వారా 11 జిల్లాల పరిధిలోని RRR ప్రాంతాలన్నీ ఒకే గొడుగు కిందకు వస్తాయి. ముఖ్యంగా ‘ల్యాండ్ పూలింగ్’ (LADP) పద్ధతిలో 10 భారీ టౌన్‌షిప్‌ల నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. ఈ విస్తరణ పూర్తయితే HYD దేశంలోనే అతిపెద్ద మెట్రోపాలిటన్ ఏరియాల్లో ఒకటిగా మారుతుంది.