News October 7, 2025
HYD: తెలుగు వర్శిటీ ఫలితాలు విడుదల

తెలుగు యూనివర్సిటీ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల వార్షిక పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి గానూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 14 ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాలలు, కళాశాలల్లో జూన్ 2025లో పరీక్షలు నిర్వహించారు. ఫలితాలను www.teluguuniversity.ac.in వెబ్‌సైట్‌లో చూడవచ్చని వెల్లడించారు.
Similar News
News October 7, 2025
ఎన్నికల విధులు నిర్లక్ష్యం చేయవద్దు: కలెక్టర్

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నోడల్ అధికారులు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి పమేలా సత్పతి ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి (ఎంసీసీ) అమలుపై అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో విధులు కేటాయించబడిన అధికారులు ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా పనిచేయాలని సూచించారు.
News October 7, 2025
మామిడికుదురు: జిల్లా స్థాయి జీఎస్టీ పోటీల్లో విద్యార్థి ప్రతిభ

మామిడికుదురు జడ్పీహెచ్ స్కూలుకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థిని చింతలపూడి అలివేలు మంగతాయారు కోనసీమ జిల్లా స్థాయి జీఎస్టీ పోటీల్లో జూనియర్స్ విభాగంలో మొదటి స్థానం సాధించింది. అమలాపురం మునిసిపల్ హైస్కూల్‌లో ఈ పోటీలు మంగళవారం జరిగాయి. మొదటి స్థానంలో నిలిచిన మంగతాయారుకు DEO ఎస్కే భాష బహుమతిని అందించారు. ఆమెను అభినందించారు. ఆమెకు గైడ్ టీచరుగా వ్యవహరించిన గంగాభవానిని అభినందించారు.
News October 7, 2025
అమలాపురం: విద్యార్థులకు జీఎస్టీ పై వ్యాసరచన పోటీలు

జీఎస్టీ వార్షికోత్సవాల సందర్భంగా అమలాపురం మున్సిపల్ మహాత్మా గాంధీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కోనసీమ జిల్లాకు చెందిన 22 మండలాల పాఠశాలల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. హెచ్‌ఎం గణ సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలను డీఈవో సలీం భాష, డిప్యూటీ కలెక్టర్ జి. మమ్మీ, ఐటీ అధికారి రవికాంత్ పర్యవేక్షించారు.