News October 14, 2025

HYD: తెలుగు వర్శిటీ.. ఫిలిం డైరెక్షన్ దరఖాస్తులకు ఆహ్వానం

image

హైదరాబాద్‌లోని సూరవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్శిటీ నాంపల్లి ప్రాంగణంలో “పీజీ డిప్లమా ఇన్ ఫిలిం డైరెక్షన్” కోర్సులో చేరేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ కోట్ల హనుమంతరావు Way2Newsతో తెలిపారు. డిగ్రీ ఉత్తీర్ణతలైన వారు అర్హులని, ఆసక్తి గల అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు వర్శిటీ రంగస్థల కళల శాఖ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్.రాజు 9346461733కు సంప్రదించాలన్నారు.

Similar News

News October 14, 2025

తెనాలి: రంగంలోకి దిగిన డాగ్ స్క్వాడ్

image

తెనాలి చెంచుపేటలో సంచలనం రేకెత్తించిన జూటూరి తిరుపతిరావు హత్య కేసు నిందితుని కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు. మృతుని స్వగ్రామం కోడితాడిపర్రులో సొసైటీ దేవాలయానికి సంబంధిన వ్యవహారంలో విభేదాల కారణంగా హత్య జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. మృతదేహానికి ఘటనా స్థలంలోనే పంచనామా నిర్వహిస్తున్నారు.

News October 14, 2025

బిహార్ ఎలక్షన్స్.. బీజేపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తొలి జాబితాను రిలీజ్ చేసింది. 71మంది అభ్యర్థులతో లిస్ట్‌ను విడుదల చేసింది. డిప్యూటీ సీఎంలు సామ్రాట్ చౌదరి తారాపూర్ నుంచి, విజయ్ సిన్హా లఖిసరాయ్ నుంచి పోటీ చేయనున్నారు. పూర్తి లిస్ట్ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి. కాగా 243 స్థానాల్లో 101 సీట్ల చొప్పున పోటీ చేయాలని ఇప్పటికే BJP, JDU నిర్ణయించుకున్నాయి. మిగిలిన సీట్లను ఎన్డీఏ కూటమిలోని మిగతా పార్టీలకు కేటాయించాయి.

News October 14, 2025

పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు సభ్యులు

image

అంపరేషన్ చేయూత ద్వారా నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన ఆరుగురు సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయారని ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. 81,141CRPF బెటాలియన్ అధికారుల ఆధ్వర్యంలో లొంగిపోయారని తెలిపారు. ఇప్పటివరకు 326 మంది లొంగిపోయారని చెప్పారు. లొంగిపోయిన పాపారావు, బండి కోస, పద్దం లక్మా, మడివి లక్మ, దొడ్డి బద్రులకు ఎస్పీ తక్షణ సహాయంగా రూ.25 వేలు అందజేశారు.