News February 23, 2026

HYD: తెలుగు వర్సిటీలో పురస్కారాలు.. దరఖాస్తు చేసుకోండి

image

MAR 27న ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా తెలుగు వర్సిటీలో యువ పురస్కార ప్రదానోత్సవం నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ కోట్ల హనుమంతరావు Way2Newsతో తెలిపారు. నటన, దర్శకత్వం, మేకప్, లైటింగ్ ఇతర రంగాల్లో కృషిచేసిన యువత పురస్కారానికి దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 35ఏళ్లలోపు ఉన్నవారు అర్హులు. రిజిస్ట్రార్, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీ, బాచుపల్లికి పోస్టు ద్వారా/నేరుగా MAR 5లోపు అప్లికేషన్స్ పంపవచ్చు.

Similar News

News February 25, 2026

సైబరాబాద్‌ కమిషనరేట్‌కు కొత్తగా 2 కేనైన్‌లు

image

తెలంగాణ సీఐడీ నుంచి రెండు పోలీస్ కేనైన్‌లు సైబరాబాద్ కమిషనరేట్‌కు బదిలీ అయ్యాయి. దీంతో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న జాగిలాల సంఖ్య18కు చేరింది. పేలుడు పదార్థాలు, మాదకద్రవ్యాల గుర్తింపు, ట్రాకింగ్ వంటి కీలక విధుల్లో ఇవి సేవలందించనున్నాయి. సీఐడీ నుంచి వచ్చిన ‘రానా’ (బెల్జియన్ మాలినోయిస్), ‘రాడో’ (లాబ్రడార్) నేరాల ఛేదనలో కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు తెలిపారు.

News February 25, 2026

TU: ప్రశాంతంగా ఎల్ఎల్‌బీ పరీక్షలు

image

తెలంగాణ విశ్వవిద్యాలయంలో ప్రధాన ప్రాంగణంలో ఎల్ఎల్‌బీ ఐదో సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 28 మంది విద్యార్థులకు 28 మంది హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా ప్రశాంతంగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు. పరీక్షలను కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అధికారులు పర్యవేక్షించారు.

News February 25, 2026

‘పార్వతీపురం జిల్లా అభివృద్ధికి నీతి ఆయోగ్ పూర్తి సహకారం అందించాలి’

image

మన్యం జిల్లా అభివృద్ధికి నీతి ఆయోగ్ పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి కోరారు. నీతి ఆయోగ్ అధికార ప్రతినిధి ఆయుషి అగర్వాల్ బుధవారం జిల్లాలో పర్యటించారు. 2047 నాటికి గ్రామాలను స్వయం సమృద్ధిగా, అభివృద్ధి పథంలో నిలబెట్టేందుకు రూపొందించిన విలేజ్ ప్లాన్-2047 అమలు చేయాలని అన్నారు. మన్యం జిల్లాలోని ప్రతి గ్రామం అన్ని రంగాల్లో వృద్ధి సాధించేలా రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేయాలన్నారు.