News August 7, 2025
HYD: తెలుగు విశ్వవిద్యాలయం చరిత్ర ఇదే!

దేశంలో భాషా ప్రాతిపదిక మీద 1985 DEC 2న HYDలో తెలుగు యూనివర్సిటీ ఆవిర్భవించింది. 1998లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంగా, 2025 మార్చి 18న సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంగా దీనికి 2సార్లు నామకరణం చేశారు. AP, ఇతర రాష్ట్రాలు, దేశాల్లో తెలుగు భాష అభివృద్ధే ధ్యేయంగా ప్రారంభమైంది. ఇందులో 1985 మార్చి 13న తూమాటి దొణప్ప ప్రత్యేకాధికారిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.
Similar News
News August 9, 2025
HYD: తమ్ముడికి ప్రాణం పోసిన అక్క

తమ్ముడి ప్రాణాలు కాపాడి ఆదర్శంగా నిలిచిన అక్క కథ ఇది. మహబూబ్‌నగర్‌కు చెందిన బాలుడు అప్లాస్టిక్ ఎనీమియా వ్యాధితో బాధపడుతూ KIMSలో అడ్మిట్ అయ్యాడు. మూల కణాల (Stem cells) మార్పిడి చేయాలని డాక్టర్లు చెప్పడంతో తన శరీరం నుంచి దానం చేసిన అక్క తమ్ముడికి పునర్జన్మను ప్రసాదించింది. ఆస్పత్రిలో ఉన్న తమ్ముడికి నేడు రాఖీ కట్టింది. ‘నేను నీకు రక్ష.. నువ్వు నాకు రక్ష’ అన్న నానుడికి ఈ సోదరి నిదర్శనం.
News August 9, 2025
జూబ్లీహిల్స్‌లో కుల రాజకీయం

జూబ్లీహిల్స్ బైపోల్ ముంగిట రాజకీయం ‘కుల’ రంగు పులుముకుంటోంది. కమ్మ కులానికి BRS అన్యాయం చేస్తోందన్న విమర్శలను ఆ పార్టీ నేతలు ఖండిస్తున్నారు. CMకు ప్రేమ ఉంటే కమ్మ నేతకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. BRS కూడా ఆ సామాజికవర్గానికి చెందిన నేతనే నిలబెడుతుందని తేల్చిచెప్పారు. అయితే, సెగ్మెంట్‌లో కమ్మ ఓట్లు 50 వేలు ఉన్నాయని, పార్టీ ఏదైనా తమకే టికెట్ ఇవ్వాలని కమ్మ రాజకీయ ఐక్యవేదిక పట్టుబట్టడం గమనార్హం.
News August 9, 2025
నిజాంపేటలో వల్లి సిల్క్స్ ప్రారంభం

హైదరాబాద్‌లో సిల్క్ వస్త్రాలకు పేరుగాంచిన వల్లి సిల్క్స్ నూతన బ్రాంచ్‌ను నిజాంపేటలో ప్రారంభించారు. ప్రజలకు మరింత చేరువలో నాణ్యమైన సిల్క్ వస్త్రాలను అందించే లక్ష్యంతో ఈ బ్రాంచ్ ప్రారంభించినట్లు వల్లి సిల్క్స్ యాజమాన్యం ప్రకటించింది. ప్రారంభోత్సవ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు, రాఖీ సందర్భంగా రూ.99 కే చీర అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆఫర్లను కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలంది.