News February 9, 2025

HYD: త్వరలోనే కార్యాచరణను ప్రకటిస్తా: కేటీఆర్

image

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ బీసీ ముఖ్యనాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై వారితో చర్చించారు. బీసీ సంబంధిత అంశాలపై కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని వెల్లడించారు. బీసీ కులగణన, స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలు సాధన తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. 

Similar News

News February 13, 2026

BREAKING: రంగారెడ్డిలో హోరాహోరి.. ఫలితాలు ఇవే!

image

రంగారెడ్డిలోని 6 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, BRS హోరాహోరీగా నిలిచాయి. మొత్తం 6 మున్సిపాలిటీల్లో 126 వార్డులు ఉండగా 54 కాంగ్రెస్, 47 బీఆర్ఎస్, 16 బీజేపీ, 9 మంది ఇండిపెండెంట్లు గెలుపొందారు. ఆమన్‌గల్‌ BRS, ఇబ్రహీంపట్నం BRS, షాద్‌నగర్ INC, శంకర్‌పల్లి INC, చేవెళ్లలో INC సత్తాచాటాయి. మొయినాబాద్‌ ఒక్క చోట హంగ్ ఏర్పడింది. అటు మేడ్చల్‌లోని అలియాబాద్‌ మున్సిపాలిటీలోనూ హంగ్ వచ్చింది.

News February 13, 2026

రంగారెడ్డి జిల్లాలో ఇదీ పరిస్థితి..!

image

రంగారెడ్డి జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లోని 126 వార్డుల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటివరకు 59 వార్డుల ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో 24 కాంగ్రెస్, 23 BRS, 7 BJP, ఐదుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ BRS కైవసం చేసుకుంది. చేవెళ్లలో 4 INC, 4 BRS, 1 BJP గెలిచాయి. షాద్‌నగర్‌లో కాంగ్రెస్ ముందంజలో ఉండగా.. ఆమన్‌గల్లులో INC బోణీ చేయలేదు. శంకర్‌పల్లిలో హోరా హోరీ నడుస్తోంది.

News February 13, 2026

రంగారెడ్డి: ఓట్ల లెక్కింపు 64 టేబుళ్లు ఏర్పాటు

image

రంగారెడ్డి జిల్లాలోని 6 మున్సిపాలిటీల పరిధిలో 126 వార్డులుండగా వీటిల్లో 274 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 1,76,023 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 1,39,044 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. షాద్‌నగర్‌లో 14 టేబుళ్లు, మొయినాబాద్‌లో 14, ఇబ్రహీంపట్నంలో 12, శంకర్‌పల్లిలో 10, చేవెళ్లలో 9, ఆమనగల్లులో 5 చొప్పున మొత్తం 64 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం 265 మందిని నియమించారు.