News August 28, 2025
HYD: త్వరలో అందుబాటులోకి 4 చెరువులు

హైదరాబాద్‌లో త్వరలో మరో 4 చెరువులు అందుబాటులోకి రానున్నాయి. ఉప్పల్ నల్ల చెరువు, బమృక్ దౌలా చెరువు, మాదాపూర్ సున్నం చెరువు, తమ్మిడికుంట అందుబాటులోకి వస్తాయని హైడ్రా తెలిపింది. అంతేకాక రాబోయే కొద్ది నెలలలోనే రెండో విడతలో మరో 13 చెరువుల అభివృద్ధిని చేపడతామని పేర్కొంది. చెరువుల పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించింది.
Similar News
News August 28, 2025
HYDలో ఎక్కడి నీరు అక్కడే ఇంకేలా హైడ్రా చర్యలు

ఎంతటి వర్షం పడినా వరదలు సంభవించకుండా, ఎక్కడి నీరు అక్కడ భూమిలోకి ఇంకేలా హైడ్రా చర్యలు చేపట్టనుంది. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో వర్షం కురిసినపుడు 100 లీటర్లు కురిస్తే అందులో 40 లీటర్లు భూమిలోకి ఇంకుతుంది. HYD నగరంలో ఇలాంటి పరిస్థితి లేదు. 98 లీటర్ల నీరు మురుగు కాలువల్లో కలుస్తోందని 2 లీటర్ల నీరు మాత్రమే భూమిలోకి ఇంకుతోందని హైడ్రా ఓ రిపోర్టులో పేర్కొంది.
News August 27, 2025
ఉస్మాన్‌సాగర్ గేట్లు ఓపెన్.. సైబరాబాద్ పోలీసుల హెచ్చరిక

భారీ వర్షాల కారణంగా ఉస్మాన్‌సాగర్ జలాశయం నిండిపోవడంతో నాలుగు గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన సైబరాబాద్ పోలీసులు మంచిరేవుల వంతెన, నార్సింగి సర్వీస్ రోడ్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేశారు. వాహనదారులు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం నీటి ప్రవాహం తక్కువగా ఉన్నప్పటికీ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
News August 27, 2025
HYD: పలు రైళ్లు రీ షెడ్యూల్

సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు మరిన్ని రైళ్లను రద్దు చేస్తూ అలెర్ట్ ప్రకటించారు. కాచిగూడ నుంచి మెదక్ వెళ్లే రైలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు లింగంపల్లి నుంచి కాకినాడ వెళ్లే గౌతమి ఎక్స్‌ప్రెస్ 20:30 గంటలకు బయలుదేరాల్సి ఉండగా 23:30 గంటలకు బయలుదేరుతుందని తెలిపారు. కాచిగూడ నుంచి వెళ్లే భగత్‌కి వెళ్లే రైలు 28న ఉదయం 6గంటలకు వెళ్తుందని పేర్కొన్నారు.