News October 22, 2024
HYD: త్వరలో ఆర్.కృష్ణయ్య కొత్త పార్టీ

బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య వెంటే నడుస్తామని తాండూరు బీసీ సంఘం నాయకులు అన్నారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. అన్నివర్గాల ప్రజాభిప్రాయ సేకరణతో త్వరలో కొత్త పార్టీని ఏర్పాటు ప్రకటించనున్నట్లు తెలిపారు. సోమవారం తాండూరుకు చెందిన బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు కందుకూరి రాజ్‌కుమార్, సయ్యద్ షుకూర్, జిల్లా నాయకులు గడ్డం వెంకటేశ్ HYDలో ఆర్.కృష్ణయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు.
Similar News
News February 13, 2026
రంగారెడ్డి జిల్లాలో ఇదీ పరిస్థితి..!

రంగారెడ్డి జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లోని 126 వార్డుల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటివరకు 59 వార్డుల ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో 24 కాంగ్రెస్, 23 BRS, 7 BJP, ఐదుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ BRS కైవసం చేసుకుంది. చేవెళ్లలో 4 INC, 4 BRS, 1 BJP గెలిచాయి. షాద్‌నగర్‌లో కాంగ్రెస్ ముందంజలో ఉండగా.. ఆమన్‌గల్లులో INC బోణీ చేయలేదు. శంకర్‌పల్లిలో హోరా హోరీ నడుస్తోంది.
News February 13, 2026
రంగారెడ్డి: ఓట్ల లెక్కింపు 64 టేబుళ్లు ఏర్పాటు

రంగారెడ్డి జిల్లాలోని 6 మున్సిపాలిటీల పరిధిలో 126 వార్డులుండగా వీటిల్లో 274 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 1,76,023 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 1,39,044 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. షాద్‌నగర్‌లో 14 టేబుళ్లు, మొయినాబాద్‌లో 14, ఇబ్రహీంపట్నంలో 12, శంకర్‌పల్లిలో 10, చేవెళ్లలో 9, ఆమనగల్లులో 5 చొప్పున మొత్తం 64 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం 265 మందిని నియమించారు.
News February 13, 2026
RR: 16న ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎంపిక

రంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఫలితాలు వెళ్లడైన వెంటనే ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల ఎంపిక ప్రక్రియ కసరత్తు ప్రారంభంకానుంది. ఈ నెల 16న ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎంపిక ఉంటుంది. ఇందుకోసం ఒక్కో మున్సిపాలిటీకి ఒక్కో అధికారిని ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. ఫలితాలు వెల్లడైన వెంటనే వీరు ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.


