News March 26, 2024

HYD: త్వరలో 14.5MW విద్యుత్ ప్లాంట్ ప్రారంభం

image

గ్రేటర్ HYD పరిధి దుండిగల్‌లోని వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ద్వారా 14.5 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయనున్నారు. దీనికోసం దాదాపుగా 1500 మెట్రిక్ టన్నుల చెత్తను ఉపయోగించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్లాంట్ ప్రారంభానికి సిద్ధమైంది. TSSPDCLతో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ సైతం పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. GHMC పరిధిలో నిత్యం సుమారు 8000 మెట్రిక్ టన్నుల గార్బేజ్ విడుదలవుతోంది.

Similar News

News September 8, 2025

HYD: 3 లక్షల 3 వేల విగ్రహాల నిమజ్జనం

image

గణేష్ నిమజ్జనం విజయవంతంగా జరిగిందని GHMC కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఆదివారం సాయంత్రం వరకు గ్రేటర్ వ్యాప్తంగా 3 లక్షల 3 వేల విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు వెల్లడించారు. పకడ్బందీ ప్రణాళిక, పటిష్టమైన ఏర్పాట్లతో కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు GHMC, పోలీసు, విద్యుత్, హెచ్ఎండీఏ, హైడ్రా, రెవెన్యూ, విద్యుత్, పారిశుద్ధ్య సిబ్బందికి అభినందనలు తెలిపారు.

News September 7, 2025

రంగారెడ్డి: నిరుద్యోగులకు శుభవార్త

image

నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 9న ఉదయం 10.30 నుంచి మ. 2.30 గంటల వరకు రంగారెడ్డి జిల్లా ఉపాధి కార్యాలయం నందు ఉద్యోగ మేళా నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయాధికారి జయశ్రీ తెలిపారు. విద్యార్హత 10th, ఇంటర్, డిగ్రీ, PG, ITI డిప్లమా. వయస్సు: 18-30 మధ్య ఉండాలి. మరిన్ని వివరాలకు 9063099306, 8977175394 నంబర్లను సంప్రదించాలన్నారు.

News September 7, 2025

ఎల్బీనగర్: మానవత్వం చాటుకున్న సీపీ

image

రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు మానవత్వం చాటుకున్నారు. బాలాపూర్ గణేశ్ నిమజ్జనోత్సవ ఏర్పాట్లను సీపీ పర్యవేక్షిస్తున్నారు. అయితే మార్గమధ్యలో ప్రమాదానికి గురైన ఓ జంటను గమనించి, తన వాహనాన్ని నిలిపివేశారు. వారికి వెంటనే ప్రథమ చికిత్స చేయించి, సురక్షితంగా పంపించారు. నిమజ్జనంలో బిజీగా ఉన్నప్పటికీ సీపీ తీసుకున్న ఈ ప్రత్యేక చొరవపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.