News June 7, 2024
HYD: ‘దండం పెట్టి చెబుతున్నాం.. రోడ్లపై చెత్త వేయకండి’

గ్రేటర్ HYD ప్రజలకు శుభ్రతపై పారిశుద్ధ్య కార్మికులు వినూత్నంగా పిలుపునిచ్చారు. HYD మాదాపూర్లోని గఫూర్నగర్లో రోడ్డు పక్కన పేరుకుపోయిన చెత్త (GVP పాయింట్)ను శుభ్రం చేసి, ముగ్గులు వేసి మాట్లాడారు. ‘ప్రజలందరికీ దండం పెట్టి చెబుతున్నాం.. ప్లీజ్ రోడ్లపై చెత్త వేయకండి.. ఇది మన హైదరాబాద్.. మనం అందరం శుభ్రంగా ఉంచుకుందాం.. ఆరోగ్యంగా ఉందాం’ అని పిలుపునిచ్చారు. కాగా దుర్వాసన వస్తున్నా వారు క్లీన్ చేశారు.
Similar News
News January 6, 2026
వారేవా.. HCUకు అంతర్జాతీయ గుర్తింపు

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. వర్సిటీకి చెందిన సీనియర్ ప్రొ.అనిల్ కుమార్ చౌదరి, స్కాలర్ చందన్ ఘోరుయీ పేలుడు పదార్థాలను గుర్తించి ప్రమాదాల నివారించే పరికరాన్ని రూపొందించారు. 0.3 టెరాహెట్జ్ రాడార్ వ్యవస్థను తయారుచేశారు. ఇది పేలుడు పదార్థాలను, లోహాలను గుర్తించి ప్రమాదాలను నివారిస్తుంది. వీరి పరిశోధన వివరాలు అంతర్జాతీయ IEEE సెన్సార్ జర్నల్లో ప్రచురించారు.
News January 6, 2026
HYD: ఈ పథకంతో రూ.50వేలు సాయం

తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (TGMFC), ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన, రేవంత్ అన్న కా సహారా మిస్కీనో కే లియే పథకాల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఈ రిజిస్ట్రేషన్లు సోమవారం నుంచి tgobmms.cgg.gov.in పోర్టల్లో ప్రారంభమయ్యాయి. మైనారిటీ మహిళా యోజనలో వితంతువులు, విడాకులు తీసుకున్నవారు, ఆర్ఫన్లు, సింగిల్ మహిళలకు రూ.50,000 సహాయం పొందవచ్చని మెయినాబాద్ ఎంపీడీవో సంధ్య తెలిపారు.
News January 6, 2026
HYD: తెలుగు చదవలేకపోతున్నారు..!

10వ తరగతి విద్యార్థులకు మాతృభాష తెలుగు చదవడం, రాయడం రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. గ్రేటర్ HYD వ్యాప్తంగా స్టడీ ఆన్ మదర్ టంగ్ నిర్వహించిన సర్వేలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 11 వేల శాంపిల్స్ పరిశీలించిన బృందం 74.6% మంది విద్యార్థులకు తెలుగు చదవడం, రాయడం రావడంలేదని తెలిపింది. సర్వేలో 3 నుంచి 10వ తరగతి వరకు ఉన్నారు. ఇందులో మెజార్టీ విద్యార్థులు మాటలకే పరిమితం అవుతున్నట్లు గుర్తించారు.


