News December 17, 2025
HYD: దమ్ బిర్యానీ పక్కదారి!

వైరల్ రీచ్ కోసం యువ ఫుడ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు అసలైన ‘దమ్ బిర్యానీ’ రుచిని పక్కన పెట్టి కేవలం ఫొటోలకు పనికొచ్చే ఫ్యాన్సీ ప్లేటింగ్‌లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో పాత తరపు ఘాటైన రుచికి, కొత్త తరఫు ఇన్‌స్టా-కేఫ్‌ల మెరుపులకు మధ్య యుద్ధమే నడుస్తోంది. ఏది ‘రుచి రాజసం’? ఏది ‘లైకుల మోసం’? అని బిర్యానీ లవర్స్ తలలు పట్టుకుంటున్నారు. మరి ‘బిర్యానీ దమ్’ చచ్చిందా? ‘రీల్స్ ట్రెండ్’ గెలిచిందా? కామెంట్ చేయండి.
Similar News
News December 18, 2025
HYD: ‘మహా ప్రస్థానం’ తెలుగు కవిత్వ దిశను మార్చింది

<<18569096>>శ్రీశ్రీ<<>> రచించిన ‘మహా ప్రస్థానం’ తెలుగు కవిత్వ దిశనే మార్చిన సంచలన కవితా సంకలనం. కార్మిక, కర్షక, శ్రామిక వర్గాల ఆవేదన, ఆకలి, నిరుద్యోగంపై గర్జించే పద్యాలు ఇందులో అగ్నిజ్వాలలుగా నిలుస్తాయి. 1930లో సామాజిక కల్లోలమే ఈ కవితలకు ప్రాణం. అలంకార కవిత్వాన్ని తోసిపుచ్చి, అభ్యుదయ కవిత్వానికి బాట వేసిన గ్రంథమిది. ‘మహా ప్రస్థానానికి ముందు- తర్వాత’ అనే విభజనకు కారణమైన ఈ సంపుటి, తెలుగు సాహిత్యంలో ఓ మైలురాయి.
News December 18, 2025
RR: 3 ఫేజుల్లో.. ముగ్గురు లక్కీ సర్పంచ్‌లు

రంగారెడ్డి జిల్లాలో 3విడతల్లో లక్కీగా సర్పంచ్ పీఠం ముగ్గురిని వరించింది. 1st ఫేజ్‌లో కొందర్గు చిన్నఎల్కిచర్లలో ఇద్దరికి సమాన ఓట్లురాగా టాస్‌తో రాజు గెలిచారు. 2nd ఫేజ్‌లో చేవెళ్ల గుండాలలో నరాలు తెగే ఉత్కంఠలో ఒక్క ఓటుతో బుచ్చిరెడ్డి గెలిచారు. 3rd ఫేజ్‌లో యాచారం తులేఖుర్దులో ఇద్దరికి సమాన ఓట్లు రాగా ఉద్రిక్తతకు దారితీస్తుందని గమనించిన పోలీసులు పరిస్థితి అదుపుచేయగా రికౌంటింగ్‌లో రమేశ్ గెలుపొందారు.
News December 18, 2025
HYDలో సింగిల్ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు

HYDలో చలి పంజా పుట్టిస్తోంది. నగరంలో సింగిల్ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పటాన్‌చెరులో కనిష్ఠంగా 8°C నమోదైంది. HYD రికార్డు స్థాయి అత్యల్ప ఉష్ణోగ్రతని అధికారులు తెలిపారు. కాగా HCU వద్ద 13°C, దుండిగల్‌లో 13°C, హయత్‌నగర్‌లో 14°C నమోదైంది. చిన్న పిల్లలను చలి నుంచి రక్షించాలి. అది వారి ప్రాణానికే ప్రమాదం. అవసరమైతేనే బయటికి రావాలని అనవసరంగా బయట తిరగొద్దని వాతావరణశాఖ అధికారులు సూచించారు.


