News September 20, 2025
HYD: దసరా తర్వాత పాఠశాలల్లో తనిఖీలు..!

HYD, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల ప్రభుత్వ పాఠశాలల తనిఖీకి విద్యాశాఖ ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. ఒక్కో అధికారి రెండు జిల్లాలను తనిఖీ చేయనున్నారు. స్కూళ్లలో పరిశుభ్రత, కొత్త ప్రవేశాలు, డేటా సవరణ, ముఖ గుర్తింపు హాజరు అమలు, PM పోషణ స్కీమ్ అమలు వంటి విషయాలను దసరా తర్వాత ఈ కమిటీలు పరిశీలిస్తాయి. తద్వారా మరింత మెరుగైన ప్రమాణాలతో విద్యను అందించవచ్చని యోచిస్తోంది.
Similar News
News September 20, 2025
H1B వీసా: 2 గంటల్లోనే భారీగా పెరిగిన టికెట్ ధర

H1B వీసాదారులు రేపటిలోగా USలో ఉండాలన్న <<17769573>>నిబంధనను<<>> విమానయాన సంస్థలు భారీగా సొమ్ము చేసుకుంటున్నాయి. ఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళ్లేందుకు ఇప్పటివరకు టికెట్ ధర రూ.34-37వేలు ఉండగా దాన్ని రూ.70-80వేలకు పెంచాయి. ట్రంప్ ప్రకటన వెలువడిన 2 గంటల్లోనే ధరలు భారీగా పెంచడం గమనార్హం. దుర్గాపూజ కోసం చాలామంది వీసాదారులు US నుంచి INDకు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వారంతా ఉరుకులు పరుగుల మీద USకు బయల్దేరుతున్నారు.
News September 20, 2025
పీ-4 కార్యక్రమానికి సంధానకర్తలుగా పని చేయాలి: కలెక్టర్

జిల్లాలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పీ-4 కార్యక్రమంలో బంగారు కుటుంబాలకు, మార్గదర్శకులకు సంధాన కర్తలుగా పనిచేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ సూచించారు. అనకాపల్లి శంకరన్ సమావేశ మందిరంలో శనివారం పీ-4 కార్యక్రమంపై సచివాలయ సిబ్బందికి ఒకరోజు శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర సచివాలయం ఉద్యోగులదేనని పేర్కొన్నారు. బంగారు కుటుంబాలకు కావలసిన అవసరాలను గుర్తించాలన్నారు.
News September 20, 2025
ఏలూరు: కోర్టు మానిటరింగ్ సభ్యులతో ఎస్పీ సమీక్ష

ఏలూరులోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ కోర్టు మానిటరింగ్ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కేసుల విచారణ వేగవంతం చేసేందుకు సాక్షులను సకాలంలో హాజరుపరచాలని ఎస్పీ సూచించారు. నేరస్తులు తప్పించుకోకుండా, బాధితులకు న్యాయం జరగాలని ఆదేశించారు. కోర్టు ప్రక్రియను ప్రతిరోజు నమోదు చేయాలని సూచించారు.