News September 11, 2025

HYD: దసరా, దీపావళి.. స్టేషన్లలో బందోబస్తు

image

దసరా, దీపావళి సందర్భంగా లక్షలాది మంది సొంతూళ్లకు వెళతారు. దీంతో సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి,చర్లపల్లి రైల్వే స్టేషన్ల వద్ద భద్రతా చర్యలు పటిష్టం చేయాలని రైల్వే ఉన్నతాధికారులు నిర్ణయించారు. ‘వెయిటింగ్ హాల్, ప్లాట్ ఫాం వద్ద నిరంతర తనిఖీలు చేయాలి. ప్రయాణికులను క్యూ లైన్లలో రైళ్లలోకి పంపించాలి. ఎంట్రీ పాయింట్ల వద్ద స్పెషల్ సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి’’ అని రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది.  

Similar News

News September 11, 2025

 GHMC ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే.. ఎందుకంటే!

image

GHMC ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా లేవు. 2026 ఫిబ్రవరి 10తో GHMC పాలక మండలి ముగియనుంది. కేవలం 5 నెలల వ్యవధి మాత్రమే ఉండటం, ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో ఎన్నికలు జరగకపోవచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా మహానగరాన్ని 2 కార్పొరేషన్లు (హైదరాబాద్, సికింద్రాబాద్) చేయాలా లేక మూడు కమిషనరేట్లా అనే విషయంపై సర్కారు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వీటి మధ్య స్పష్టత వచ్చాకే ఎన్నికలపై నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది.

News September 11, 2025

నిమ్స్‌కు క్యూ కడుతున్న రోగులు

image

నగరంలో ప్రతిష్ఠాత్మక నిమ్స్ ఆస్పత్రికి రోగులు క్యూ కడుతున్నారు. చికిత్స కోసం వేల మంది ఓపీకి వస్తుండటంతో ఆస్పత్రి కిటకిటలాడుతోంది. 3 రోజుల్లోనే దాదాపు 11,590 మంది వచ్చారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సోమవారం 4,055 మంది, మంగళవారం 3,600 మంది వచ్చారు. ఇంత పెద్ద సంఖ్యలో రోగులురావడం నిమ్స్ చరిత్రలో ఇదే మొదటిసారి.

News September 11, 2025

సికింద్రాబాద్: కావేరీ సీడ్స్ వద్ద రైతులు నిరసన

image

సికింద్రాబాద్ పారడైస్‌లోని కావేరీ సీడ్స్ వద్ద ఛత్తీస్‌గఢ్ రైతులు గురువారం నిరసనకు దిగారు. కావేరి సీడ్స్ వేసి పంట నష్టపోయిన తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఒక్కో ఎకరానికి రూ.12,000 చొప్పున పెట్టుబడి సహాయం కింద ఇచ్చారని పేర్కొన్న రైతులు ఒక్కో ఎకరానికి రూ.50 వేలు చెల్లించి నష్టాన్ని పూడ్చాలని కోరారు.