News September 20, 2025

HYD: ‘దసరా సెలవులు.. ఆర్టీసీ బస్ ఛార్జీల పెంపు’

image

దసరా సెలవుల వేళ TGSRTC బస్సుల ఛార్జీలు పెంచిందని ప్రయాణికులు వాపోతున్నారు. పండుగ పేరుతో అదనపు బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది వరకు ఉప్పల్ నుంచి తొర్రూరుకు సూపర్ లగ్జరీలో టికెట్ రూ.300గా ఉంటే ఇప్పుడు రూ.430 తీసుకుంటున్నారని చెబుతున్నారు. స్పెషల్ బస్సులన్నిటిలోనూ ఛార్జీల పెంపు ఉందని తెలిపారు.

Similar News

News September 20, 2025

భారత్ ఓటమి

image

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత మహిళల జట్టు పోరాడి ఓడింది. 413 పరుగులు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ఇండియాకు స్మృతి మంధాన(125) అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. హర్మన్ ప్రీత్(52), దీప్తి శర్మ(72) అర్ధశతకాలతో రాణించినా.. కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడంతో విజయానికి 43 పరుగుల దూరంలో ఆలౌటైంది. దీంతో 1-2తో భారత్ సిరీస్ కోల్పోయింది. ఆసీస్ బౌలర్లలో కిమ్ మూడు వికెట్లు తీసి సత్తా చాటారు.

News September 20, 2025

విశాఖ రైల్వే స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఆర్ఎం

image

విశాఖ రైల్వే స్టేషన్ డీఆర్ఎం లలిత్ బోహ్ర శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పండుగల రద్దీ కారణంగా రైల్వే ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి స్టేషన్‌లో మంచినీటి పైప్ లైన్లు ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. ప్లాట్ ఫామ్‌పై ఉన్న క్యాంటీన్లలో ఆహార నాణ్యత పరిశీలించారు. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో శుభ్రత ప్రమాణాలు పాటించాలన్నారు.

News September 20, 2025

నిజామాబాద్: భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి: సీఎస్

image

జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణ కోసం భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కలెక్టర్లను ఆదేశించారు. శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జాతీయ రహదారి పనులకు సంబంధించి జిల్లా వారీగా పెండింగ్‌లో ఉన్న భూసేకరణ అంశాలను చర్చించారు. భూములు కోల్పోయిన రైతులకు అందించాల్సిన పరిహారం, చెల్లింపుల గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నారు.