News September 20, 2025

HYD: ‘దసరా సెలవులు.. ఆర్టీసీ బస్ ఛార్జీల పెంపు’

image

దసరా సెలవుల వేళ TGSRTC బస్సుల ఛార్జీలు పెంచిందని ప్రయాణికులు వాపోతున్నారు. పండుగ పేరుతో అదనపు బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది వరకు ఉప్పల్ నుంచి తొర్రూరుకు సూపర్ లగ్జరీలో టికెట్ రూ.300గా ఉంటే ఇప్పుడు రూ.430 తీసుకుంటున్నారని చెబుతున్నారు. స్పెషల్ బస్సులన్నిటిలోనూ ఛార్జీల పెంపు ఉందని తెలిపారు.

Similar News

News September 20, 2025

సికింద్రాబాద్ మహంకాళమ్మ గుడిలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు

image

తెలంగాణలో ప్రసిద్ధి చెందిన సికింద్రాబాద్ శ్రీఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఈనెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని, అందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని ఆలయ ఈవో గుత్తా మనోహర్ రెడ్డి ఈరోజు వెల్లడించారు. ఆలయ ఛైర్మన్ రామేశ్వర్‌తో కలిసి ఉత్సవాల ఏర్పాట్లపై మీడియాతో మాట్లాడారు.మద్రాస్ కళాకారుల ద్వారా ప్రత్యేక పూలతో అమ్మవారి అలంకరణ ఉంటుందన్నారు.

News September 20, 2025

MGBS టు చాంద్రాయణగుట్ట.. ఇప్పట్లో కష్టమే?

image

హైదరాబాద్ మెట్రోను పాతబస్తీకి తీసుకెళ్లాలన్న కాంగ్రెస్ పార్టీ కోరిక ఇప్పట్లో తీరేలా లేదు. MGBS నుంచి చాంద్రాయణగుట్ట వరకు మెట్రో రైల్ నడుపుతామని ప్రభుత్వం భావించింది. అందుకు చురుగ్గా పనులు కూడా ప్రారంభమయ్యాయి. దాదాపు 7.5 కిలోమీటర్ల ఈ పనులపై ఇపుడు నీలినీడలు కమ్ముకున్నాయి. ఇపుడు నడుస్తున్న మెట్రోనే మేము నిర్వహించలేమని ఎల్అండ్ టీ చెబుతోంటే ఓల్డ్ సిటీ మెట్రో ఇప్పుడు కష్టమే అని తెలుస్తోంది.

News September 20, 2025

HYD: అసలు మెట్రో మ్యాన్‌ను ఎందుకు తప్పించినట్టు?

image

మెట్రో పనులు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 18 సంవత్సరాలు.. హైదరాబాద్ మెట్రో అంటే ఆయన పేరే గుర్తుకు వస్తుంది. మెట్రో మ్యాన్ అనే పేరు కూడా సంపాదించుకున్నారు. ఆయనే ఎన్వీఎస్ రెడ్డి. మెట్రో ఎండీగా సుదీర్ఘ కాలం పాటు సేవలందించిన ఆయన్ను రేవంత్ రెడ్డి ఎందుకు తప్పించారు అనేది ఇపుడు సిటీలో చర్చనీయాంశంగా మారింది. అసలే సందిగ్ధంలో ఉన్న మెట్రో నిర్వహణపై ఎండీ మార్పు ప్రభావం పడుతుందనేది నిర్వివాదాంశం.