News October 2, 2024

HYD: ‘ద‌స‌రా సెల‌వుల్లో పాఠ‌శాల‌లు నిర్వ‌హిస్తే చ‌ర్య‌లు’

image

రాష్ట్రంలోని ప్ర‌భుత్వ‌, ప్రైవేటు పాఠ‌శాల‌ల‌కు ఈ నెల 14 వ‌ర‌కు ద‌స‌రా సెలవులు ఇస్తున్న‌ట్లు విద్యాశాఖ ప్ర‌క‌టించింది. 15వ తేదీన తిరిగి పాఠ‌శాల‌లు ప్రారంభం కానున్నాయి. విద్యాశాఖ ఆదేశాలు పాటించ‌కుండా ప్రత్యేక క్లాసెస్, ట్యూషన్లు వంటివి కార్పొరేట్, ప్రైవేటు స్కూల్స్ నిర్వ‌హిస్తే, అలాంటి పాఠ‌శాల‌ల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని విద్యాశాఖ అధికారులు హెచ్చ‌రించారు.

Similar News

News January 25, 2026

HYD: సాగర తీర విగ్రహాల వెనుక దాగిన చరిత్ర

image

HYD- SECను కలిపే హుస్సేన్‌సాగర్‌కు వెళ్తే వరుసగా కొలువైన 34 మంది మహానీయుల విగ్రహాలపైకి చూపు మళ్లక మానదు. ముందు తరాల వారికి దీని గురించి తెలిసినా.. నేటి తరానికి అదొక ప్రశ్నే. ఈ విగ్రహాలతో వారి గొప్పతనాన్ని చాటి చెప్పేందుకు ఇక్కడ ఏర్పాటు చేశారు. వీరు ఎవరు? అనే సందేహం అందరి మదిలో మెదులుతోంది. ఈ మహనీయుల వీరగాథ, చరిత్ర చెప్పేందుకు Way2News రోజుక్కొక్కరి స్టోరిని సంక్షిప్తంగా అందిస్తుంది.

News January 25, 2026

రంగారెడ్డి: ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్

image

భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నేడు రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలు, మండల కార్యాలయాలు, పోలింగ్ బూత్ స్థాయుల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ వేడుకల్లో ప్రజలు, యువత పెద్దఎత్తున పాల్గొనాలని కలెక్టర్ కోరారు.

News January 25, 2026

HYD: ఓపెన్‌లో PG, డిప్లొమా చేయాలనుకుంటున్నారా?

image

ఈ ఎడాదికి సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీలో ఓపెన్ పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికెట్‌లకు సంబంధించిన వివిధ కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు దూర విద్యా కేంద్రం డైరెక్టర్ ఆచార్య పద్మప్రియ తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు sprtu.softelsolutions.in, www.teluguuniversity.ac.in వెబ్‌సైట్‌లో మార్చి 31లోగా దరఖాస్తులు చేసుకోవాలని, వివరాలకు 73306 23411 ఫోన్ చేయాలన్నారు.