News February 24, 2025
HYD: దాయాదుల మ్యాచ్.. భారీగా పందేలు

నిన్న దాయాదుల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ సందర్భంగా రూ.కోట్లల్లో పందేలు సాగాయి. బంతిబంతికి రూ.2000-2500 వరకు పందేలు వేసుకున్నారు. చందానగర్, మాదాపూర్, ఎల్బీనగర్, గోషామహల్, చిలకలగూడ, ముషీరాబాద్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో పెద్దఎత్తున సొమ్ము చేతులు మారినట్లు తెలుస్తోంది. మాదాపూర్‌లో ఓ స్థిరాస్తి వ్యాపారి వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి వీటిని నిర్వహించినట్లు సమాచారం. దీనిపై పోలీసులు నిఘా ఉంచారు.
Similar News
News February 24, 2025
HYD: మైనర్లపై అధికారుల నిఘా..!

మాదకద్రవ్యాలపైనే కాదు మైనర్లకు సిగరెట్ అమ్మకాలపైనా అధికారులు HYDలో నిఘా పెంచారు. దీనికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు TG యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్యా తెలిపారు. ఇవి సెల్‌ఫోన్‌లతో పాటు సీక్రెట్ కెమెరాలతో వీడియోలు తీస్తుంటాయి. ఈ వీడియోల ఆధరాంగా వ్యాపారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నారు. వరుస ఫిర్యాదుల నేపథ్యంలో ఈ బృందాలు కొనసాగుతాయిని ఆయన వెల్లడించారు.
News February 24, 2025
HYD: HICCలో బయో ఏషియా సదస్సు

జీవ విజ్ఞాన రంగంలోని పరిశోధకులు, పారిశ్రామికవేత్తలు, విధాన రూపకర్తలను ఒక వేదికపైకి తీసుకొచ్చే బయో ఏషియా సదస్సుకు రంగం సిద్ధమైంది. 22వ సదస్సు ఈ నెల 25, 26 తేదీల్లో HYDలోని హెచ్‌ఐసీసీ వేదికగా జరగనుంది. 50 దేశాలకు చెందిన దాదాపు 3,000 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు. CM రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రేపు సదస్సు ప్రారంభం కానుంది.
News February 24, 2025
HYD: నయన మనోహరంగా కూచిపూడి రంగ ప్రవేశం

సంపూర్ణ ప్రత్యక్ష, ఆర్‌కెస్ట్రాతో లక్ష్య రాచప్రోలు కూచిపూడి రంగ ప్రవేశం నయన మనోహరంగా జరిగింది. రవీంద్రభారతిలో త్రిష్ట కూచిపూడి ఆరాడమీ ఆధ్వర్యంలో జరిగిన ప్రముఖ నాట్య గురువు డా.అలేఖ్య పుంజాల శిష్యురాలు లక్ష్య రాచప్రోలు కూచిపూడి అరంగేట్రం చేశారు. మహాగణపతిని స్మరిస్తూ ప్రదర్శనకు శుభారంభం పలికి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ సృజన అమ్మ ఆనంద గాయనితో ప్రేక్షకులను కట్టిపడేశారు.