News July 22, 2024

HYD: దారుణం.. ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం

image

HYDలో వరుస అత్యాచార ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా శంషాబాద్‌లో మరో ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి సిద్ధాంతి గ్రామంలో ఐదేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. చిన్నారికి తీవ్ర రక్తస్రావమైంది. బాలిక అరుపులు విన్న స్థానికులు నిందితుడిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. బాలికను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Similar News

News February 18, 2026

గోల్కొండ గెస్ట్ హౌస్‌లో సామాన్యుడికి ‘నో ఎంట్రీ’

image

సర్కారు వారి ‘వారసత్వ’ వ్యాపారం ముదిరి పాకాన పడింది. చారిత్రక గోల్కొండ గెస్ట్ హౌస్‌ను సామాన్యులకు దూరం చేస్తూ కేవలం బడా బాబులకే పరిమితం చేసేలా పర్యాటక శాఖ పావులు కదుపుతోంది. ‘బ్యూటిక్ హోటల్స్’ పేరుతో ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతున్న ఈ ఆస్తులు ఇకపై “ఇన్విటేషన్ ఓన్లీ” క్లబ్బులుగా మారబోతున్నాయి. గండిపేట రిసార్టుల్లో రూమ్ కావాలంటే పైస్థాయి రికమండేషన్ ఉండాల్సిందే అన్నట్లుగా నిబంధనలు మారుస్తున్నారు.

News February 18, 2026

HYD: షాద్‌నగర్ యాక్సిడెంట్‌లో చనిపోయింది వీరే..!

image

షాద్‌నగర్ సమీపంలోని రాయికల్ టోల్ ప్లాజా వద్ద <<19172186>>అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం<<>> జరిగిన విషయం తెలిసిందే. కాగా, అరుణాచలం నుంచి HYD తిరిగి వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఇన్నోవా క్రిస్టాను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తుర్కయంజాల్‌కు చెందిన పురుషోత్తం రెడ్డి, మధుసూదన్ రెడ్డి అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘనటపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News February 18, 2026

FSLలో కొలువులు.. NOTIFICATION వచ్చేసింది..!

image

TG ఫోరెన్సిక్ ల్యాబ్(FSL) ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకు గమనిక. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తిచేసుకున్న వారిలో 1:5 నిష్పత్తిలో అభ్యర్థులను రాతపరీక్షలకు ఎంపిక చేశారు. MAR 5,6,7 తేదీల్లో మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో పరీక్షలు జరగనున్నాయి. షార్ట్ లిస్ట్ కానివారు రూ.500 ఫీజు చెల్లించి FEB 21వ తేదీ ఉదయం 8గంటల వరకు ఆన్‌లైన్‌లో తమ అభ్యంతరాలు తెలపవచ్చు. హాల్ టికెట్ల వివరాలు త్వరలో వెల్లడిస్తారు.