News February 28, 2025
HYD: దేశ రక్షణ బాధ్యత యువతపై ఉంది: సీఎం

గచ్చిబౌలిలోని స్టేడియంలో జాతీయ సైన్స్ సందర్భంగా విజ్ఞాన్ వైభవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దేశ రక్షణ బాధ్యత యువతీ, యువకులపై ఉందని, దేశ రక్షణలో HYD దశాబ్దాలుగా కీలకపాత్ర పోషిస్తుందన్నారు. BDL, HAL, మిధాని వంటి కీలక సంస్థలు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయని, సైన్స్ ద్వారా విద్యార్థులకు దేశ రక్షణ పట్ల అవగాహన కలుగుతుందన్నారు.
Similar News
News February 28, 2025
పేద ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్: శ్రీనివాస వర్మ

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా ఉందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం కోసం రూ.3.2 లక్షల కోట్ల నిధులు కేటాయించడం హర్షణీయమన్నారు. తెలుగు భాష అభివృద్ధికి రూ.10కోట్లు కేటాయించడంతో పాటు సూపర్ సిక్స్ పథకాల అమలకు నిధులు కేటాయించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
News February 28, 2025
మంత్రి తుమ్మల అనుచరుడు గాదె సత్యం మృతి

సత్తుపల్లి మాజీ జడ్పీటీసీ సభ్యులు, సీనియర్ రాజకీయ నాయకులు గాదె సత్యనారాయణ (76) ఊపిరితిత్తుల వ్యాధితో శుక్రవారం హైదరాబాదులో చికిత్స పొందుతూ మృతి చెందారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడిగా మూడున్నర దశాబ్దాల పాటు రాజకీయాలలో సేవలందించారు. ఆయన మృతిపట్ల మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే డా. రాగమయి దయానంద్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఆయా పార్టీల నాయకులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
News February 28, 2025
ప్రకాశం: ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

ప్రకాశం జిల్లాలో మార్చి ఒకటో తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆర్ఐవో సైమన్ విక్టరీ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 67 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇందులో 5 సమస్యాత్మకమైన కేంద్రాలుగా గుర్తించామని.. అక్కడ ప్రత్యేక నిఘా ఉంచుతామన్నారు.