News August 15, 2024

HYD: దేశ విశిష్టతపై అవగాహన కల్పించాలి

image

పిల్లలకు బాల్యం నుంచే దేశ విశిష్టత పట్ల అవగాహన కల్పించాలని రాచకొండ సీపీ ఐపీఎస్‌ సుధీర్ బాబు ఐపీఎస్ సూచించారు. రాచకొండ కమిషనరేట్‌, నేరేడ్‌మెట్‌లో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆయన జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం సిబ్బందికి, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్కూల్ పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేశారు.

Similar News

News October 24, 2025

HYD: CM సార్.. జర మా వైపు చూడండి!

image

పండగొచ్చినా, పబ్బమొచ్చినా ఆ జీవి రోడ్డెక్కాల్సిందే. చలి, వాన, ఎండ ఎరుగరు. ఏం చేస్తా మరి.. రెక్కాడితేనే డొక్కాడే జీవితాలు. బల్దియా కార్మికుల బాధ ఇది. ‘లక్షలు జీతాలు తీసుకునే వారికే పండుగ బోనస్‌లు.. మా వైపు ఎవరు చూస్తారు సార్’ అంటూ ఓ కార్మికుడు Way2Newsతో వాపోయాడు. వాస్తవానికి సిటీని క్లీన్ చేయడంలో పారిశుద్ధ్య సిబ్బంది కీలకం. CM చొరవ చూపితే తమ జీవితాలు బాగుపడతాయని కార్మికులు వేడుకుంటున్నారు.

News October 24, 2025

బస్సు ప్రమాదంలో.. పటాన్‌చెరు వాసులు మృతి

image

కర్నూల్ బస్సు ప్రమాదంలో తల్లి, కొడుకు మృతి చెందారు. బెంగళూరు వెళ్లేందుకు సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు కృషి డిఫెన్స్ కాలనీకి చెందిన రాము, అతని తల్లి పటాన్‌చెరులో బస్సు ఎక్కారు. దీపావళి పండుగకోసం బెంగళూరు నుంచి స్వగ్రామానికి వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఘటనా స్థలంలోనే ఇద్దరూ మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News October 24, 2025

HYD: షాకింగ్.. 3 రోజుల్లో ముగ్గురు ఫ్రెండ్స్ సూసైడ్

image

అబ్దుల్లాపూర్‌మెట్(మం) కోహెడలో మూడు రోజుల్లో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతుంది. వీళ్లు 6th-10th కలిసి చదువుకున్నారు. గ్యార వైష్ణవి(18) మంగళవారం ఉరేసుకుంది. ఆమె క్లాస్మెట్ సతాలీ రాకేశ(21) ఇంటి సమీపంలో ఓ షెటర్లో బుధవారం ఉరేసుకున్నాడు. అదే ఊరిలోని బుద్ధ శ్రీజ(18) గురువారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకొని కనిపించింది. దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ నాగరాజ్ గౌడ్ తెలిపారు.