News November 21, 2025
HYD: దొంగ నల్లా కనెక్షన్‌పై ఫిర్యాదు చేయండి

గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా నల్లా అక్రమ కనెక్షన్లపై అధికారుల రైడ్ కొనసాగుతుంది. అనేక ప్రాంతాల్లో దాదాపుగా 50 మందికిపైగా వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఎవరైనా అక్రమ కనెక్షన్లు గుర్తించినా, డొమెస్టిక్ కనెక్షన్ తీసుకున్న వారు, కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తే 99899 98100 నంబర్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.
Similar News
News November 22, 2025
శుక్ర మౌఢ్యమి.. 83 రోజులు ఈ శుభకార్యాలు చేయొద్దు: పండితులు

ఈ నెల 26 నుంచి వచ్చే ఏడాది FEB 17 వరకు(83 రోజులు) శుక్ర మౌఢ్యమి ఉందని పండితులు వేదస్మార్త గురురాజుశర్మ తెలిపారు. ‘శుభాలకు అధిపతులైన గురు, శుక్రుడు ఈ మూఢాల్లో సూర్యుడికి సమీపంగా రావడంతో శక్తిని కోల్పోతాయి. ఈ రోజుల్లో వివాహం, గృహప్రవేశాలు, వాహనాల కొనుగోళ్లు, బోర్లు తవ్వించడం, పుట్టువెంట్రుకలు తీయడం, యాత్రలకు వెళ్లడం వంటివి చేయొద్దు. నిత్యారాధన, సీమంతాలకు ఈ దోషం వర్తించదు’ అని పేర్కొన్నారు.
News November 22, 2025
జిల్లాలో నూతనంగా 108 పోలింగ్ కేంద్రాలకు ప్రతిపాదన

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణకు సంబంధించి నూతనంగా 108 పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదించినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి తెలిపారు. ఆమె అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణపై శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. 1200 ఓటర్లు పైబడిన ఉన్నచోట నూతన పోలింగ్ కేంద్రాన్ని ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు.
News November 22, 2025
పుట్టపర్తికి చేరుకున్న సీఎం, మంత్రి లోకేశ్

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకల్లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి నారా లోకేశ్ పుట్టపర్తికి చేరుకున్నారు. వారికి మంత్రులు, ఎమ్మెల్యేలు ఘనస్వాగతం పలికారు. మరికాసేపట్లో పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకోనున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సీఎం, లోకేశ్ స్వాగతం పలకనున్నారు. అనంతరం వారు ప్రశాంతి నిలయంలో జరిగే శతజయంతి వేడుకల్లో పాల్గొంటారు.


