News June 17, 2024
HYD: ధార్ GANG చరిత్ర ఇదే..!

గ్రేటర్ HYDలో కలకలం సృష్టిస్తోన్న భయంకరమైన ధార్ గ్యాంగ్ గతంలోనూ చోరీలకు పాల్పడింది. MP,UPకి చెందిన ఈ గ్యాంగ్ చివరిసారిగా 2022లో సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో చోరీలు చేసింది. ధార్ ముఠాపై 2018-2022మధ్య సైబరాబాద్‌లో 138,రాచకొండలో 32చోరీ కేసులు నమోదయ్యాయి. కాగా అప్పుడు ఈముఠా నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపడంతో రెండేళ్లుగా ఇటు వైపు రాలేదు. మళ్లీ ఇప్పుడు వచ్చి వరుస చోరీలు చేస్తున్నారు.
Similar News
News April 5, 2026
HYD: సిటీలో ఫస్ట్ థియేటర్ ఏదో మీకు తెలుసా?

మల్టీప్లెక్స్‌ల హవాలో భాగ్యనగర సినిమా చరిత్రకు సజీవ సాక్ష్యంగా ‘యాకుత్ మహల్’ థియేటర్ నిలుస్తోంది. 1930ల్లో నవాబ్‌జాఫర్ నవాజ్‌జంగ్ నిర్మించిన ఈ చారిత్రక వేదికల్లో సాక్షాత్తూ నిజాం ప్రభువులే సినిమాలు వీక్షించారు. ఇప్పటికీ పాతతరం చికాగో ప్రొజెక్టర్లతోనే ఇక్కడ షోలు నడుస్తుండటం విశేషం. అతి తక్కువ టికెట్ ధరతో సామాన్యులకు వినోదాన్ని పంచుతూ, ఓటీటీల కాలంలోనూ తన ఉనికిని కాపాడుకుంటుంది.

మెట్రో రెండో దశ విస్తరణపై అనిశ్చితి !

హైదరాబాద్ మెట్రో రెండోదశ విస్తరణపై కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అడిగిన ప్రశ్నకు పార్లమెంట్‌లో కేంద్రం సమాధానం ఇచ్చింది. రెండో దశ విస్తరణకు సంబంధించి ఎలాంటి గడువు విధించలేదని స్పష్టం చేసింది. అలాగే మెట్రో ఫేస్-1 స్వాధీనంపై ప్రభుత్వానికి సూచనలు మాత్రమే చేశామని పేర్కొంది. దీంతో అసలు మెట్రో రెండోదశ ఎప్పుడు పూర్తవుందనే దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.