News April 15, 2024
HYD: నకిలీ టికెట్‌తో విమానం ఎక్కిన వ్యక్తి అరెస్ట్
నకిలీ టికెట్‌తో విమానం ఎక్కిన ఓ వ్యక్తి శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్ట్ అయ్యాడు. APలోని NTR జిల్లాకు చెందిన వ్యక్తి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సర్వీసులో గోవా వెళ్లడానికి టికెట్‌ను తీసుకొని గోవా విమానంలో కూర్చున్నాడు. ఆయన బంధువు కోటేశ్వర్ రావు అదే నంబర్‌తో టికెట్, వెబ్ బోర్డింగ్ పాస్ సృష్టించి గోవా విమానంలో కూర్చోగా.. చెక్ చేసి నకిలీ టికెట్‌గా గుర్తించారు. దీంతో భద్రతాధికారులు అరెస్ట్ చేశారు.
Similar News
News January 8, 2025
HYD: లవర్స్ సజీవదహనం (UPDATE)
ఘట్‌కేసర్ PS పరిధి ORR సర్వీస్ రోడ్డుపై కారు దగ్ధం ఘటనలో మరో విషయం వెలుగులోకి వచ్చింది. చనిపోయే ముందు శ్రీరామ్(25) ఫోన్ నుంచి అమ్మాయి(17) వాట్సాప్‌లో లైవ్ లొకేషన్‌తో పాటు 3 పేజీల లెటర్‌ను ఆమె తండ్రికి సెండ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అంతకుముందే అన్నోజిగూడలోని ఓ దుకాణంలో పెట్రోల్ కొనుగోలు చేసినట్లు తెలిసింది. బాలిక తండ్రి వారున్న లొకేషన్ వెళ్లేసరికి కూతురు, శ్రీరామ్ మంటల్లో <<15087962>>సజీవదహనమయ్యారు<<>>.
News January 8, 2025
HYDలో ఒకేసారి పూసిన 92 పువ్వులు
అరుదుగా కనిపించే బ్రహ్మ కమలాలు ఒకేసారి 92 వికసించాయి. మణికొండ మున్సిపాలిటీ పుప్పాలగూడలోని ధనలక్ష్మి రమణమూర్తి ఇంట్లో చెట్టుకు ఈ అద్భుతం జరిగింది. ఒకే రోజు పదుల సంఖ్యలో పూలు పూయడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఏడాదికి ఒకేసారి పూసే బ్రహ్మకమలాలు విరివిగా పూయడం విశేషం.
News January 8, 2025
చర్లపల్లి టెర్మినల్ ఓపెన్.. మరి రోడ్లు?
చర్లపల్లి టెర్మినల్ అత్యాధునిక హంగులతో ప్రారంభమైంది. స్టేషన్‌కు వెళ్లే రోడ్లను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికుల అభిప్రాయం. సిటీ నుంచి వచ్చే వారు హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్ మీదుగా స్టేషన్‌కు చేరుకోవచ్చు. కీసర, మేడ్చల్, ECIL వాసులు రాంపల్లి మీదుగా వస్తారు. ప్రస్తుతం ఈ రహదారులు బాగానే ఉన్నాయి. ప్రయాణికుల రద్దీ పెరిగితే రోడ్లను విస్తరించాల్సిందేనా..? దీనిపై మీ కామెంట్?