News September 11, 2025

HYD: నకిలీ వెబ్‌సైట్లను గుర్తించడంపై ముందడుగు..!

image

HYDలో CipherCop-2025 ప్రారంభమైందని బుధవారం సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ షికాగోయల్ తెలిపారు. ఇది మొదటి జాతీయ హ్యాకథాన్ అన్నారు. వచ్చే 2 రోజుల్లో యువ మేధావులు పోలీస్ టెక్నాలజీ మిషన్ ప్రేరణతో క్రిప్టో లావాదేవీలు గుర్తించడం, నకిలీ వెబ్‌సైట్లు, స్కామ్ యాప్‌లు, మోసపూరిత డిజిటల్ కంటెంట్‌ను వెలికితీయడంపై సవాళ్లు స్వీకరిస్తారని చెప్పారు.

Similar News

News April 5, 2026

మెదక్: 3 నెలల రేషన్.. 30 వరకు పంపిణీ

image

మెదక్ జిల్లాలో 520 రేషన్ దుకాణాల ద్వారా ఏప్రిల్, మే, జూన్ మూడు నెలల సన్న బియ్యం సరఫరా జరుగుతోందని జిల్లా సివిల్ సప్లై అధికారి నిత్యానంద్ తెలిపారు. లబ్ధిదారులు తొందరపడకుండా ఈ నెల 30 వరకు సమీప రేషన్ దుకాణాల్లో సరుకులు పొందాలని సూచించారు. సరుకుల కొరత లేదని, పారదర్శకంగా పంపిణీ జరుగుతుందని చెప్పారు. వదంతులు నమ్మకుండా అవసరమైతే అధికారులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

News April 5, 2026

అనంత జిల్లాలో సీఎం పర్యటన షెడ్యూల్ ఖరారు

image

సీఎం చంద్రబాబు ఈనెల 6న అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. కలెక్టర్ ఓ.ఆనంద్ శనివారం పర్యటన షెడ్యూల్ వెల్లడించారు. ఉదయం 11:10 గంటలకు యాడికి మండలం వేములపాడుకు చేరుకొని మార్కెట్ యార్డ్‌లో జరిగే ‘ప్రజా వేదిక’లో పాల్గొంటారు. మధ్యాహ్నం పెండేకల్లు రిజర్వాయర్ వద్ద నీటి సంరక్షణ పనులను పరిశీలిస్తారు. అనంతరం వేములపాడులో కార్యకర్తల సమావేశానికి హాజరవుతారు. సాయంత్రం 4:20 గంటలకు తిరిగి అమరావతికి పయనమవుతారు.

News April 5, 2026

కామారెడ్డి: వరి కొనుగోలు ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

image

కామారెడ్డి కలెక్టరేట్‌లో వరి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సమీక్ష నిర్వహించారు. MSP ప్రకారం గ్రేడ్-1 వరికి రూ.2,389, సాధారణ వరికి రూ.2,369కు కొనుగోలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత కోసం ప్రోక్యూర్మెంట్ యాప్ వినియోగంపై సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. రైతులకు ఇబ్బందులు లేకుండా కేంద్రాల్లో తగిన సదుపాయాలు అందించాలన్నారు.