News August 8, 2024

HYD నగరంలో ధూళి కణాలే అధికం.. జాగ్రత్త..!

image

HYD నగరం NACP లక్ష్యాలను సాధించడంలో సగటు పనితీరు కనబరిచిందని తెలిపింది. వాయు కాలుష్య నియంత్రణకు సంబంధించి నగరం యావరేజ్ పర్ఫార్మెన్స్ సిటీస్ జాబితాలో చేరింది. HYD నగరంలో పార్టీక్యులేట్ మ్యాటర్ (ధూళికణాలు ) 2.5 ఉద్గారాల నియంత్రణపై దృష్టి పెట్టాలని సూచించింది. దేశంలో 100 స్కోర్ సాధించిన నగరాలు 4 ఉండగా..75 స్కోర్ సాధించిన నగరాల్లో 26 ఉన్నాయి.75 స్కోర్ సాధించిన లిస్టులో హైదరాబాద్ సైతం ఉంది.

Similar News

News February 24, 2026

నాగోల్: బజాజ్ ఎలక్ట్రానిక్స్‌లో ఘరానా మోసం: బాధితుడు

image

నాగోల్ PS పరిధి అల్కాపురి బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌లో ఘరానా మోసం జరిగిందని వికలాంగుడైన బాధితుడు ఆరోపించారు. కొత్త మొబైల్ పేరిట పాత ఫోన్ అంటగట్టినట్లు ఆయన వాపోయారు. తనకు న్యాయం చేయాలని షోరూమ్ ముందు నిరసనకు దిగగా.. సిబ్బంది బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. వినియోగదారుల హక్కులను కాలరాసే ఇలాంటి వ్యవహారాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని షోరూమ్‌ ముందు బైఠాయించారు.

News February 24, 2026

మరికొన్ని గంటల్లో HYDలో భారీ వర్షం

image

నగరంలోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే కొన్ని గంటల్లో నగరమంతా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో తీవ్రత ఎక్కువగా ఉండవచ్చని మ్యాప్ విడుదల చేసింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని అధికారులు సూచించారు.

News February 23, 2026

RR: ఉగ్గుపాల నుంచే ఒగ్గు కథల వైపు మల్లారి!

image

ఒగ్గు కథ చెప్పడం మగాళ్లకే పరిమితమైన రోజుల్లో ఓ మహిళ కథ చెప్పడానికి బయలుదేరింది. రంగారెడ్డి(D),యాచారం(M), నక్కర్త మేడిపల్లికి చెందిన జమ్మ మల్లారి. ఈమె వేలకొద్దీ బీరప్ప కళ్యాణాలు చేసి, ఒగ్గు కథలు వినిపించి ఒగ్గుకథ ‘సూపర్‌స్టార్‌’గా ఎదిగారు. జీవితాన్ని ఒగ్గుకథకు అంకితం చేసి తొలి మహిళా ఒగ్గు కథా కళాకారిణిగా పేరుగాంచి 2020లో విశిష్ట మహిళా పురస్కారాన్ని అందుకుని FEB 7న ఆమె శివైక్యం చెందారు.