News March 30, 2024
HYD నగరంలో హీటెక్కిస్తున్న సూరీడు!

గ్రేటర్ HYD, ఉమ్మడి RR జిల్లాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. శుక్రవారం మూసాపేటలో గరిష్ఠంగా 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కుత్బుల్లాపూర్‌లో 42 డిగ్రీలు, ఖైరతాబాద్ 41.5, హయత్ నగర్ 41.7, చందానగర్ 41.5, శేరిలింగంపల్లి 41.2, యూసుఫ్ గూడలో 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా నగరవాసులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News April 22, 2025
Inter Results: రంగారెడ్డి విద్యార్థులకు ALERT

నేడు మ. 12 గంటలకు తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల చేస్తారు. మన రంగారెడ్డి జిల్లాలో ఇంటర్ ఫస్టియర్‌లో 83,829 విద్యార్థులకు 81,966 మంది పరీక్ష రాశారు. సెకండియర్‌లో 71,684 విద్యార్థులకు 70,431 మంది హాజరయ్యారు. పరీక్ష రాసిన పిల్లల భవితవ్యం నేడు తేలనుంది. రిజల్ట్ చూసుకునేందుకు నెట్ సెంటర్లకు వెళ్లే పని లేదు.. మొబైల్ ఉంటే చాలు. మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి Way2Newsలో చెక్ చేసుకోండి.
SHARE IT
News April 21, 2025
రేపు ఇంటర్ రిజల్ట్స్.. రంగారెడ్డిలో వెయిటింగ్

రేపు మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మన రంగారెడ్డి జిల్లాలో 185 సెంటర్లు ఏర్పాటు చేయగా.. ఇంటర్ ఫస్టియర్‌లో 83,829 విద్యార్థులకు 81,966 మంది పరీక్ష రాశారు. సెకండియర్‌లో 71,684 విద్యార్థులకు 70,431 మంది హాజరయ్యారు. పరీక్ష రాసిన పిల్లల భవితవ్యం రేపు తేలనుంది. ఇంటర్ ఫలితాలను <<16170006>>Way2News<<>>లో చెక్ చేసుకోండి.
SHARE IT
News April 21, 2025
HYD: విభిన్న వాతవరణం.. 3 రోజులు జాగ్రత్త..!

హైదరాబాద్‌లో రోజు రోజుకూ ఎండలు ఎక్కువవుతున్నాయి. HYD, MDCLలో గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీల వరకు నమోదవుతోంది. మధ్యాహ్నం వరకు ఎండ కొడుతుండగా, సాయంత్రం వర్షం పడుతోంది. ఉదయం 7 గంటల నుంచే వేడిమి అధికంగా ఉంటుంది. నేటి నుంచి మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాక గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు చేరనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.