News March 7, 2025
HYD: నగర విస్తరణకు మంత్రివర్గం ఆమోదం

HYD విస్తరణకు మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం 7 జిల్లాలు, 7,257 చదరపు కిలోమీటర్లు ఉన్న HMDA పరిధి తాజా నిర్ణయంతో 11వేల చదరపు కిలోమీటర్ల నుంచి 12 వేల చదరపు కిలోమీటర్ల వరకు పెరగనుంది. కొత్తగా RRR వరకు విస్తరించడంతో మరో 4 జిల్లాల పరిధిలోని 32 మండలాలు చేరనున్నాయి. దీంతో 11 జిల్లాలు, 16 మండలాలు సుమారు 1,400 పైగా గ్రామాలతో HMDA పరిధి భారీగా పెరగనుంది.
Similar News
News March 9, 2025
ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

బయ్యారం మం. మిర్యాలపెంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కారేపల్లి సూర్యతండాకు చెందిన కళ్యాణ్, విజయ్ బైక్‌పై స్నేహితుడి పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్నారు. మిర్యాలపెంట వద్ద బైక్ అదుపు తప్పి కళ్యాణ్‌కు రోడ్డుపక్కన ఉన్న చెట్టు దుంగ తాకడంతో మృతి చెందాడు. విజయ్ గాయంతో బయటపడ్డాడు. కళ్యాణ్‌కు 2 నెలల క్రితమే వివాహం నిశ్చయమవగా హోలీ తర్వాత పెళ్లి పెట్టుకుందామనుకున్నారు.
News March 9, 2025
బాపట్ల : చికెన్, మటన్ ధరలు ఇలా..!

బాపట్ల జిల్లా వ్యాప్తంగా ఆదివారం చికెన్, మటన్‌ధరలకు డిమాండ్ పెరిగింది. గతవారంతో పోలిస్తే కేజీకి రూ.20-30 ధర పెరిగింది. పలు చోట్ల ఈ వారం కేజీ చికెన్ స్కిన్ లెస్ రూ.200, స్కిన్ రూ. 180ల వరకు విక్రయిస్తున్నారు. మటన్ ధర కేజీ రూ.800- 900లు ఉంది. బర్డ్ ఫ్లూ భయాందోళనలు తగ్గడంతో చికెన్ ధరలలో రూ.30లకు పైగా ధర పెరిగింది. మరి మీ ప్రాంతంలో ఎలా ఉందో కామెంట్ చేయండి.
News March 9, 2025
ఆలస్యమవుతున్న ‘రాజాసాబ్’? అదే కారణమా?

ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ కామెడీ మూవీ ‘ది రాజాసాబ్’. ఈ సినిమా సింహభాగం షూటింగ్ పూర్తయింది. అయితే ఓ విచిత్రమైన పరిస్థితి కారణంగా పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యమవుతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకూ పూర్తైన ఫుటేజీ ఏకంగా మూడున్నర గంటలు ఉన్నట్లు తెలుస్తోంది. దాన్ని తగ్గించేందుకు మూవీ టీం చెమటోడుస్తోందని సినీవర్గాలంటున్నాయి. ప్రభాస్ ఇందులో తాత, మనవడి పాత్రల్లో కనిపిస్తారని టాక్.